Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఇప్పటంలో పర్యటించారు. గతంలో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన బుధవారం గ్రామానికి చేరుకున్నారు. కొద్దిసేపు వృద్ధురాలితో పవన్ ముచ్చటించారు. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఈ గ్రామానికి పవన్ కు మధ్య బలమైన అనుబంధమే ఉంది. వైసీపీ హయాంలో రోడ్ల విస్తరణ నేపథ్యంలో ఇక్కడి జనసేన నేతల ఇండ్లను వైసీపీ కూల్చివేసింది. అప్పట్లో పవన్ నేరుగా గ్రామానికి వచ్చి బాధితులకు అండగా నిలిచారు. ఈ క్రమంలో పవన్ అధికారంలోకి వస్తే మళ్లీ గ్రామానికి రావాలని నాగేశ్వరమ్మ కోరారు. అప్పుడు ఇచ్చిన మాటకు అనుగుణంగా పవన్ ఇప్పుడు ఇప్పటంలో అడుగుపెట్టడం విశేషం.
భగ్గుమన్న వర్గపోరు..
పవన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటంలోని జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణలో కొట్లాటకు దిగారు. జనసేన నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి కూర్చీలతో కొట్టుకున్నారు. దీంతో ఇప్పటం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను వెనక్కి తీశారు. జనసేన నేతలకు సర్దిచెప్పి.. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. పవన్ పర్యటన నేపథ్యంలో మరింత ఐక్యంగా ఉండాల్సిన జనసేన నేతలు.. ఇలా వర్గపోరుతో విడిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన నేపథ్యంలో వివాదం
ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణలో కొట్లాట
పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రెండు వర్గాల మధ్య గొడవ
పోలీసులు సర్దిచెప్పడంతో సద్దుమణిగిన గొడవ pic.twitter.com/MMK5SNf1wZ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2025
కారుపైకి ఎక్కిన పవన్..
పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన అనగానే ముందుగా అందరికీ ఓ ఘటన గుర్తుకు వస్తుంది. కారు పైకి ఎక్కి కూర్చొని.. పవన్ ఆవేశంతో ఊగిపోయిన సన్నివేశాలు ఇప్పటికీ జనసైనికుల మదిలో మెదులుతూనే ఉంటాయి. ఇప్పటం వివాదం విషయానికి వస్తే.. 2022 మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సం కోసం ఇప్పటం గ్రామస్తులు తమ భూములు ఇచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వైసీపీ నేతలు.. 100 అడుగుల రోడ్డు విస్తీర్ణం పేరిట జనసేన సానుభూతి పరుల ఇళ్లు, ప్రహారీలను కూల్చి వేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పవన్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
" నాన్న నువ్వు 5 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి "
– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఇండ్ల నాగేశ్వరమ్మ pic.twitter.com/UmUojqGoFJ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2025
Also Read: ISRO Bahubali Rocket: ఇస్రో కొత్త చరిత్ర.. బాహుబలి ప్రయోగం సక్సెస్.. ప్రధాని మోదీ హర్షం
రూ.50,000 ఆర్థిక సాయం
2024 నవంబర్ 5న ఇప్పటం గ్రామానికి పవన్ స్వయంగా విచ్చేశారు. బాధితులను అడిగి తమ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగానే ఇండ్ల నాగేశ్వరమ్మను పవన్ కలిశారు. ఈ క్రమంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇప్పటం గ్రామానికి రావాలని ఆమె పవన్ ను వేడుకుంది. దీంతో ఆమె పిలుపును మన్నించిన పవన్.. ఇప్పటం గ్రామానికి తిరిగివస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు దానిని నెలబెట్టుకుంటూ.. గ్రామంలో మరోమారు అడుగుపెట్టారు. అయితే స్థానికంగా జరిగిన గొడవకు సంబంధించి.. జనసేన నేతలకు పవన్ క్లాస్ పీకే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

