MLA Rajesh Reddy: నాగర్‌కర్నూల్ నియోజకవర్గం తాడూరు కస్తూర్బా పాఠశాల విద్యార్థినిలకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ మరియు మానవతా ఫౌండేషన్ సంయుక్తంగా పర్యావరణ హిత సానిటరీ కప్స్ అందించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Also Read: BJP MLAs Arguments: అసెంబ్లీలో గొడవ పడ్డ అధికార ఎమ్మెల్యేలు.. నచ్చజెప్పిన విపక్ష సభ్యులు!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ
అమ్మాయిలు చదువుతోపాటు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉండాలని, ఎలాంటి ఇతర అలవాట్లకు ఆకర్షణలకు లోను కాకుండా విద్యపై ప్రత్యేక దృష్టి వహించాలని సూచించారు. బాలికలకు సరైన అవగాహన కల్పించేందు ముందుకు వచ్చిన ఆటా ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు.
బాలికలకు ఆరోగ్యం పట్ల సరైన అవగాహన
కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించి బాలికలకు ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, సర్పంచ్ మల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, జిల్లా వైద్యాధికారి రవి నాయక్, కేజీబీవీ పర్యవేక్షణ అధికారిని శోభారాణి, తాడూరు మండల విద్యాధికారి త్యాగరాజు గౌడ్, కేజీబీవీ ప్రత్యేక అధికారిని విజయ, ఉపాధ్యాయులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Abhaya App: ఆటో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఒక్క స్కాన్‌తో మీరంతా సేఫ్ జెర్నీ..?

