Abhaya App: ఆటో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
Abhaya App (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Abhaya App: ఆటో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఒక్క స్కాన్‌తో మీరంతా సేఫ్ జెర్నీ..?

Abhaya App: ఆటో ప్రయాణికుల భద్రత కోసం అభయ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మహబూబాబాద్(Mahabubabad) జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan) పేర్కొన్నారు. నేడు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో ఆటో ప్రయాణికుల భద్రతను బలపరిచే కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 1281 ఆటో వాహనాలకు “మై టాక్సీ సేఫ్ ”(My Taxi Safe) అనే అభయ యాప్‌(Abhaya App)కు సంబంధించిన క్యూ ఆర్ కోడ్(QR code) అమర్చారు. అలాగే ఆటో నడిపే వ్యక్తులను ఒక సంస్థతో అనుసంధానం చేసి, ప్రతి సంవత్సరం 350 రూపాయల ప్రీమియంతో ప్రమాదంలో మరణానికి రూ.1 లక్ష భీమా అందే విధంగా ఏర్పాటు చేశారు. ఈ భీమా పత్రాలు డ్రైవర్లకు అందజేశారు.

ప్రయాణికులకు తక్షణ భద్రతా సమాచారం

ఆటోలో అసురక్షిత పరిస్థితి ఎదురైనప్పుడు, ప్రయాణికులు ఆటోపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానేడ్రైవర్‌ ఫోటో, వ్యక్తిగత వివరాలు, వాహన సమాచారము తక్షణమే మొబైల్‌లో కనిపిస్తాయి. ఫోన్ నంబర్‌ని యాప్‌లో నమోదు చేసి “ప్రదేశాన్ని తెలుసుకోండి” అనే ఎంపికను ఎంచుకుంటే, అత్యవసర కాల్, అత్యవసర ఫిర్యాదు అనే రెండు ఎంపికలు కనిపిస్తాయి. లైవ్ స్థానం కమాండ్ కేంద్రానికి ప్రయాణికుడు అత్యవసర కాల్ లేదా ఫిర్యాదు పంపిన వెంటనే, వారి లైవ్ స్థానం కమాండ్ కేంద్రానికి చేరుతుంది. ఆటోలో ఎక్కిన క్షణం నుండి దిగే వరకు కమాండ్ కేంద్రం ద్వారా గమనిక కొనసాగుతుంది. సమీపంలోని పోలీసు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు తీసుకుంటారు.

Also Read: Visakhapatnam: విశాఖలో అమానుషం.. కాలువలో పుట్టిన బిడ్డ శరీర భాగాలు.. తల మాత్రం మిస్సింగ్..!

అభయ యాప్ ముఖ్య ప్రయోజనాలు

మహిళా ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్టర్ వివరాలు చూసుకోవచ్చు.

ప్రయాణ సమయంలో ఏదైనా వస్తువులు మరిచిపోయినా, యాప్ ద్వారా ఆటోను గుర్తించి తిరిగి పొందవచ్చు.

ఆ ఆటో డ్రైవర్ గతంలో ఏదైనా నేరంలో పాలుపంచుకున్నట్లైతే, స్కాన్ చేసిన వెంటనే “ఈ ఆటో సురక్షితం కాదు” అనే ఎరుపు సూచన కనిపిస్తుంది.

అసభ్య ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి నడపడం, ఢీకొట్టి పారిపోవడం వంటి ఘటనలను కూడా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రయాణం పూర్తయ్యాక డ్రైవర్‌కు రేటింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది.

పోలీసులు ఆటో నడిపే వ్యక్తులు నియమాలు పాటిస్తూ, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకుండా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతి రావు(DSP Thirupathi Rao), పట్టణ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, బయ్యారం సీఐ రాజేష్(CI Rajesh), డోర్నకల్ సీఐ చంద్రమౌళి(CI Chandramouli), ట్రాఫిక్ ఎస్.ఐ అరుణ్ కుమార్(SI Aruna Kumar),ట్రాఫిక్ సిబ్బంది అభయ యాప్ రూపకర్త అభిచరన్(Abhicharan), ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Also Read: MLA Rajender Reddy: గన్‌మెన్ లేకుండా బస్టాండ్‌కు వెళ్లి సవాలు విసిరిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే.. షాక్‌లో జనం

Just In

01

Kishan Reddy: ఢిల్లీలో ఓట్ చోరీ నిరసన అట్టర్ ఫ్లాప్: కిషన్ రెడ్డి

Rahul Gandhi: ఓట్ చోరీ అతిపెద్ద దేశద్రోహ చర్య.. ఒక్కరిని కూడా వదలం: రాహుల్ గాంధీ

Thaman Reply: థమన్ రెమ్యూనరేషన్ ఏం చేస్తారో తెలుసా.. ఆ సమయంలో అదే నడిపించింది..

Mahesh Kumar Goud: కవిత బీఆర్ఎస్ బ్యాటింగ్ దంచి కొడుతోంది: మహేష్ కుమార్ గౌడ్

Bandi Sanjay: యువతకు అందుబాటులో ఉంటానన్న హామీ ఏమాయే? బండి సంజయ్