Double bedroom scam: డబుల్​ బెడ్రూం ఇండ్ల పేర మోసాలు
Double bedroom scam ( image credit: swetcha reporter)
హైదరాబాద్

Double bedroom scam: డబుల్​ బెడ్రూం ఇండ్ల పేర మోసాలు.. ఎన్ని లక్షల వసూలు చేశారంటే?

Double bedroom scam: డబుల్ బెడ్​రూం ఇండ్ల పేర జనం నుంచి లక్షలు వసూలు చేసిన ఇద్దరిని సుల్తాన్​ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్​ డీసీపీ బాలస్వామి అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ మట్టయ్యతో కలిసి మీడియా సమావేశంలో వివరాల వెల్లడించారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన విజయ్ (35) ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్​ బాయ్​ గా ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంత నివాసి అంబం మురళి (54)తో అతనికి పరిచయం ఉంది.

Also Read: Double Bed House Scam: డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కుంభకోణంలో మరో కేసు

అసిస్టెంట్ డైరెక్టర్​ అని పరిచయం

ఇదిలా ఉండగా అక్టోబర్​ నెలలో గన్​ ఫౌండ్రి ప్రాంతంలో జరిగిన ముదిరాజ్ సామాజిక వర్గం సమ్మేళనంలో విజయ్​ కి బడీచౌడీ వాస్తవ్యురాలు, సామాజిక కార్యకర్త అయిన సరస్వతితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తనకు పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులతో పరిచయాలు ఉన్నట్టుగా మురళి చెప్పుకొన్నాడు. ఆ తరువాత మురళిని తెలంగాణ స్టేట్​ హౌసింగ్​ కార్పోరేషన్​ లో అసిస్టెంట్ డైరెక్టర్​ అని పరిచయం చేశాడు.

39లక్షలు వసూలు

తమ పలుకుబడితో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి సరస్వతి నుంచి డబ్బు తీసుకున్నారు. ఆమె ద్వారా ఆర్టీసీలో పని చేస్తున్న మరో 18మంది నుంచి మొత్తం 39లక్షలు వసూలు చేశారు. అయితే, ఏ ఒక్కరికి కూడా డబుల్​ బెడ్రూం ఇల్లు ఇప్పించలేదు. ఒత్తిడి చేసిన వారికి ఇండ్లు అలాట్ అయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఈ మేరకు సరస్వతి ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన సీఐ నర్సింహ విచారణ మొదలు పెట్టి నిందితులు ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

Also Read: Double Bedroom Scam: ఇల్లు ఇప్పిస్తామని రూ.30 లక్షలు వసూలు

Just In

01

RV Karnan: రెండేళ్ల పని పదేళ్లు చేస్తారా? ప్రాజెక్టుల విభాగంపై కమిషనర్ కర్ణన్ తీవ్ర అసహనం!

Harish Rao: అక్రమ కేసులు పెడుతున్న పోలీసుల పేర్లు రాసుకుంటున్నాం : మాజీ మంత్రి హరీష్ రావు!

The Rise Of Ashoka: ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి వచ్చిన రొమాంటిక్ మెలోడీ ఎలా ఉందంటే?

Thummala Nageswara Rao: నష్టపోయిన సోయాబీన్ రైతులకు న్యాయం చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల విచారణకు రంగం సిద్ధం!