iQOO Z11 Turbo: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన రాబోయే Z11 Turbo ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ను అధికారికంగా ప్రకటించింది. Weibo వేదికగా iQOO కంపెనీకి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ ‘Battle Sprite’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేశారు. విడుదలైన టీజర్ ఇమేజ్‌లో ఫోన్ వెనుక భాగం కొత్తగా కనిపిస్తోంది. ఇందులో ఆకర్షణీయమైన బ్లూ కలర్ ఫినిష్, స్వల్పంగా వంకరగా ఉన్న ఎడ్జెస్, అలాగే కింద భాగంలో iQOO బ్రాండింగ్ కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్‌కు మెటల్ ఫ్రేమ్ ఉండే అవకాశముందని కూడా సమాచారం.
అదే సమయంలో, ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ Digital Chat Station Weiboలో వెల్లడించిన వివరాల ప్రకారం, iQOO Z11 Turbo ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండనుంది. పనితీరు విషయంలో ఇది Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ నుంచి పని చేస్తుందని సమాచారం. అలాగే భద్రత, వేగవంతమైన అన్‌లాక్ కోసం ఈ ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.
బ్యాటరీ విషయానికి వస్తే, iQOO Z11 Turboలో 8,000mAh నుంచి 9,000mAh వరకు భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనికి 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా దుమ్ము, నీటికి మెరుగైన రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్ ఇవ్వనున్నారని సమాచారం.
ఇప్పటివరకు iQOO Z11 Turbo అధికారిక లాంచ్ డేట్‌ను కంపెనీ ప్రకటించలేదు. అయితే ఇప్పటికే డిజైన్ టీజర్ విడుదల కావడంతో, ఈ స్మార్ట్‌ఫోన్‌ను రాబోయే కొన్ని వారాల్లోనే అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త డిజైన్, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్‌లో మంచి స్పందన పొందే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

