Viral Video: హిమాచల్‌ప్రదేశ్‌లోనే (Himachal Pradesh) అతిపెద్ద హాస్పిటల్‌గా ఉన్న ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (IGMC) షాకింగ్ ఘటన జరిగింది. గౌరవించి మాట్లాడాలంటూ కోరిన ఓ పెషెంట్ పట్ల ఒక వైద్యుడు అనాగరికంగా వ్యవహరించాడు. భౌతిక దాడికి సైతం పాల్పడినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో అర్జున్ పన్వార్ అనే పెషెంట్ మెడికల్ టెస్టుల కోసం హాస్పిటల్‌కు వెళ్లారు. బెడ్‌పై పడుకొని ఉన్న అర్జున్ పన్వార్.. ఆక్సిజన్ అందివ్వాలని సిబ్బందిని కోరాడు. అయితే, అడ్మిషన్ స్టేటస్ చెప్పాలంటూ ప్రశ్నించిన డాక్టర్, చాలా దురుసుగా ప్రవర్తించాడని అర్జున్ చెప్పారు. గౌరవించి మాట్లాడాలంటూ తాను విజ్ఞప్తి చేశానని చెప్పారు. ‘‘నువ్వు కేవలం నువ్వే అంటూ డాక్టర్ స్పందించడంతో, మీ ఇంట్లో వాళ్లతో ఇలాగే ప్రవర్తిస్తావా? అని నేను అడిగాను. అప్పుడు డాక్టర్ మరింత రెచ్చిపోయాడు. నా వ్యక్తిగత విషయాలే ప్రశ్నిస్తావా అంటూ దాడికి పాల్పడ్డాడు’’ అని బాధిత పేషెంట్ చెప్పారు. భౌతిక దాడికి దాడికి పాల్పడ్డాడని వాపోయారు.
తాను శాంతంగా మాట్లాడినప్పటికీ, ఎలాంటి కారణంగా లేకుండా ఆ వైద్యుడు దురుసుగా ప్రవర్తించాడని అర్జున్ వాపోయారు. గతంలో తనకు బ్రాంకోస్కోపీ జరిగిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. కాగా, ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌లో (Viral Video) మీడియాలో తెగ వైరల్‌గా మారింది. డాక్టర్ పదేపదే పేషెంట్‌పై దాడికి పాల్పడడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేషెంట్‌పై జాలిపడాల్సిందిపోయి, ఈ విధంగా దాడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత, పెద్ద సంఖ్యలో నిరసనకారులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. ఒక రోగి పట్ల ఇంతదారుణంగా ప్రవర్తించిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కమిటీ ఏర్పాటు
ఈ ఘటనపై ఐజీఎంసీ హాస్పిటల్ ఉన్నతాధికారులు స్పందించారు. విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కమిటీ విచారణ జరుపుతోందని ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ రాహుల్ రావు వెల్లడించారు. కొన్ని గంటల వ్యవధిలోనే కమిటీ తన నివేదికను సమర్పించనుందని చెప్పారు. నిందిత వైద్యుడిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయిందని వెల్లడించారు. కాగా, ఐజీఎంసీ హాస్పిటల్ సిమ్లాలో ఉంది. ఇక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండడంతో, రోగులు నాణ్యమైన చికిత్స పొందుతుంటారు.
Read Also- Thanuja: ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ఆరంభం.. తనూజ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
SHOCKER 🚨 Doctor beats up Patient at IGMC Shimla, Himachal's biggest hospital🤯
IGMC Shimla claims Teacher Arjun Panwar was suffering from breathing difficulties & was resting after endoscopy
Patient said Doctor spoke rudely and the argument escalated😳pic.twitter.com/Z4YWckcMeL
— News Algebra (@NewsAlgebraIND) December 22, 2025

