Samsung Galaxy S26 Ultra: గత కొన్ని సంవత్సరాలుగా సామ్‌సంగ్ తన Galaxy S Ultra సిరీస్‌ను జనవరిలోనే పరిచయం చేస్తూ వస్తోంది. అయితే తాజాగా దక్షిణ కొరియా పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, కంపెనీ Galaxy S26 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్‌ను మారుస్తోంది. దీంతో Galaxy S26 Ultra విడుదల ఆశించిన దానికంటే ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
మారిన లాంచ్ టైమ్‌లైన్
తాజా నివేదికల ప్రకారం, ఈసారి Galaxy Unpacked ఈవెంట్‌ను సామ్‌సంగ్ జనవరి 2026 లో కాకుండా ఫిబ్రవరి మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది. దీనివల్ల Galaxy S26 Ultra లాంచ్, గత మోడల్‌తో పోలిస్తే కొన్ని వారాలు ఆలస్యమవుతుంది. అధికారిక లాంచ్ తర్వాత దాదాపు రెండు వారాల్లోనే రిటైల్ సేల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో, Galaxy S26 సిరీస్ ఫోన్లు ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి ప్రారంభంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ ఆలస్యం ఉన్నప్పటికీ, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) ప్రారంభానికి ముందే సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్‌లను విడుదల చేయనుందని సమాచారం. సాధారణంగా మార్చి మొదట్లో జరిగే ఈ గ్లోబల్ టెక్ ఈవెంట్‌కు ముందు లాంచ్ చేయడం వలన, ప్రత్యర్థి బ్రాండ్ల కంటే ముందుగా తన కొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్లను ప్రదర్శించాలనే వ్యూహంలో సామ్‌సంగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల మనోవేదన.. అప్పులపాలై ఆగమాగం అంటూ..!
Galaxy S26 Ultra ఎందుకు ఆలస్యం అవుతోంది..?
Galaxy S26 Ultra లాంచ్ ఆలస్యానికి ప్రధాన కారణం సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ వ్యూహంలో మార్పులు అని నివేదికలు చెబుతున్నాయి. బేస్ Galaxy S26 మోడల్‌కి, Ultra వేరియంట్‌కి మధ్య ఉండే మోడళ్ల విషయంలో కంపెనీ పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. మరో ముఖ్య కారణంగా చిప్‌సెట్ ఎంపికను కూడా పేర్కొంటున్నారు. Galaxy S26 Ultra ప్రపంచవ్యాప్తంగా క్వాల్‌కామ్ కొత్త తరం Snapdragon ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త చిప్‌సెట్‌కు సంబంధించిన పరీక్షలు, పూర్తి కావడానికి అదనపు సమయం అవసరమవడంతో లాంచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా.
Galaxy S26 Ultra నుంచి ఏం ఆశించాలి?
అధికారిక స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడి కాలేదు గానీ, లీక్‌ల ప్రకారం Galaxy S26 Ultra లో కెమెరా పనితీరు, డిస్‌ప్లే క్వాలిటీ, ఆన్-డివైస్ AI ఫీచర్లపై సామ్‌సంగ్ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో పాటు, సాఫ్ట్‌వేర్ పరంగా కూడా కొత్త ఫీచర్లు లాంచ్ ఈవెంట్‌లో సామ్‌సంగ్ హైలైట్ చేయనున్నట్లు సమాచారం.

