Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే?
Kalyan and Tanuja
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) ముగిసింది. ఇప్పటి వరకు జరిగిన అన్నీ సీజన్లు మించి ఈ సీజన్ బాగా రక్తికట్టించారు. కామనర్స్, సెలబ్రిటీస్ థీమ్‌తో మొదలైన ఈ బిగ్ బాస్.. ముందు కాస్త స్లోగా మొదలైనప్పటికీ, హౌస్‌లో బాండింగ్స్ ఏర్పడిన తర్వాత చాలా ఆసక్తికరంగా మారింది. ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ.. టాప్ 5‌గా కళ్యాణ్, తనూజ, ఇమ్మానుయేల్, పవన్, సంజన నిలిచారు. వీరిలో నుంచి సంజన టాప్ 5 ప్లేస్‌ని సొంతం చేసుకుని ఎగ్జిట్ అయింది. టాప్ 4గా ఇమ్మానుయేల్ వెనుదిరిగాడు. ఇక టాప్ 3 ప్లేస్‌లో డిమోన్ పవన్ సిల్వర్ సూట్‌కేస్ యాక్సెప్ట్ చేసి రూ. 15 లక్షలతో హౌస్ నుంచి వెనుదిరిగాడు. ఇక టాప్ 2లో కళ్యాణ్, తనూజ నిలిచారు.

Also Read- Demon Pavan: డిమోన్ పవన్ రైట్ డెసిషన్.. సూట్‌కేస్ తీసుకోకుండా ఉంటేనా?

తనూజ రాంగ్ డెసిషన్

డిమోన్ పవన్ రూ. 15 లక్షలు తీసుకున్న అనంతరం ఇంకా ప్రైజ్ మనీలో రూ. 35 లక్షలు మిగిలాయి. ఇందులో నుంచి రూ. 20 లక్షలు గోల్డెన్ సూట్‌కేస్ తీసుకుని కింగ్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లారు. ఇద్దరినీ ఆ మనీ తీసుకుని టాప్ 2గా వెళ్లమని అడిగారు. కానీ ఇద్దరూ వద్దని చెప్పారు. ఇద్దరూ వద్దనడంతో ఆ సూట్ కేస్ తీసుకుని, ఇద్దరినీ తీసుకుని నాగ్ స్టేజ్‌పైకి వచ్చారు. ఈలోపు నాగార్జున జర్నీపై బిగ్ బాస్ ఓ ఏవీ ప్రదర్శించారు. నాగార్జున (King Nagarjuna) కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం స్టేజ్‌పైకి వాళ్లిద్దరినీ తీసుకొచ్చి కళ్యాణ్ విన్నర్ అయినట్లుగా కింగ్ నాగార్జున ప్రకటించారు. రన్నరప్‌గా తనూజ నిలిచారు. రూ. 20 లక్షలు వద్దనుకుని తనూజ రాంగ్ డెసిషన్ తీసుకుంది. తనపై అంత నమ్మకం ఉంది తనకి. కానీ, లక్ మాత్రం కలిసి రాలేదు.

Also Read- KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రైజ్ మనీ ఎంతంటే.. (Bigg Boss Telugu 9 Prize Money)

విన్నర్ అయిన కళ్యాణ్‌ (Kalyan Padala)కు రూ. 35 లక్షల క్యాష్ ప్రైజ్‌తో పాటు, మారుతి సుజుకీ విక్టోరీస్ కారు గిఫ్ట్‌గా అందించారు. అంతేకాదు, సర్‌ప్రైజ్ అమౌంట్‌గా Roff ఓచర్ రూ. 5 లక్షలు అదనంగా కళ్యాణ్ గెలుచుకున్నారు. అనంతరం వస్తున్నాను, కొడుతున్నాను, కొట్టాను.. అని విన్నింగ్ స్పీచ్‌తో కళ్యాణ్ అందరినీ ఆకర్షించాడు. అనంతరం వాళ్ల అమ్మనాన్నలను స్టేజ్‌పైకి పిలిచి, గౌరవించారు. అనంతరం తనూజకు, శ్రీజకు, ఆడియెన్స్‌కు కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!

Kiara Advani: ‘టాక్సిక్‌’లో కియారా అద్వానీ.. రాకింగ్ ఫస్ట్ లుక్ చూశారా!

Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!

Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. క్షేత్రస్థాయిలో గందరగోళం!

Constable Incident: పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్న బెట్టింగ్ యాప్‌లు!