KCR On Chandrababu: ఏపీ ఏర్పాటే తెలంగాణకు శాపం: కేసీఆర్
KCR-BRS (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR On Chandrababu: తెలంగాణ భవన్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ (BRS LP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం (KCR BRS LP) ముగిసింది. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఏర్పాటే తెలంగాణకు శాపంగా మారిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేశాయని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై (Chandrababu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకున్నారని, కానీ, ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటయ్యి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని పేర్కొన్నారు. పాలమూరులో కృష్ణానది చాలా దూరం ప్రయాణిస్తున్నా, రాష్ట్రం ఏర్పాటు కాకముందు జిల్లాలో కనీసం 30 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. పాలమూరులో చంద్రబాబు ఎన్నో పునాది రాళ్లు వేశారు, కానీ, ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. జూరాల ప్రాజెక్ట్ అంజయ్య హయాంలోనే మొదలైందని కేసీఆర్ అన్నారు.

పాలమూరు గోసపై గోరటి వెంకన్న పాలు కూడా రాశారని ప్రస్తావించారు. బచావత్ ట్రిబ్యూన్‌లో నీటి పంపకాలపై స్పష్టంగా ఉందని, అయినప్పటికీ మహాబూబ్‌నగర్‌కు అన్యాయమే జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని, వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతమని కేసీఆర్ విమర్శించారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ తాను జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశానని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ తాను జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశానని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని ప్రాజెక్టులను అధ్యయనం చేశామని, వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పాలమూరు కరువుతో లక్షలమంది ముంబైకి వలస వెళ్లారని పేర్కొన్నారు.

Read Also- KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

సర్వ భ్రష్ట ప్రభుత్వం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదొక సర్వ భ్రష్ట ప్రభుత్వమని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘సర్వంలో భ్రష్టం ఇది. రాష్ట్రం ఒక క్రమ పద్దతిలో పోతూ ఉండింది. కానీ, ఈ రోజు పరిస్థితి ఏంది?. జంట నగరాల్లో నడిరోడ్డుపై పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. మానభంగాలు, రేపులు జరుగుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో నేరాలు 20 శాతం పెరిగాయి. ప్రశాంతంగా ఉండే రాష్ట్రం కాస్త ఇలా తయారైంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేది. అవన్నీ రాష్ట్రంలో మృగ్యం అయిపోతున్నాయి. అన్ని చూసుకుంటూ రికార్డ్ చేస్తున్నాం. అన్నింటిపైనా చర్చించుకుంటున్నాం’’ అని అన్నారు.

మీరు చేసిన వాగ్దానాలు ఏంది?

వాగ్దానాలు ఏమిచ్చారు?, ఏం అమలు చేశారు? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘మాకు ఓటు వేసే ఉద్దేశం ఉన్న ప్రజలను పచ్చి అబద్దాలు, టెంప్ట్ చేసి, దొంగ మాటలు, మాయమాటలు చెప్పి, వేలంపాట పాడినట్టు చేశారు. రైతు బంధుకు కేసీఆర్ రూ.10 వేలు ఇస్తాడు. మేము రూ.15 వేలు ఇస్తామని ప్రచారం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం కూడా ఇస్తామన్నారు. కొన్ని పెళ్లిళ్లు కూడా ఆపారు. డిసెంబర్‌లో చేసుకుంటే తులం బంగారం వస్తదని ఊదరగొట్టారు. డిసెంబర్‌లో తీసుకుంటే వృద్దులకు నాలుగు వేల పెన్షన్ వస్తుందని అన్నారు’’ అని కేసీఆర్ అన్నారు. రెండేళ్లపాటు ఎదురుచూశామని, ఇకపై రాష్ట్రంలో ఉద్యమాలు ఉంటాయని కేసీఆర్ హెచ్చరించారు.

‘‘దిక్కుమాలిన మాటలన్నీ చెప్పి, నేడు కనీసం వడ్డు కొనడం లేదు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామంటూ ప్రకటించారు. కానీ, నేడు పంటలు కూడా కొనే దిక్కులేదు. రైతులు దోపిడీకి కూడా గురవుతు ప్రైవేటు వాళ్లకు అమ్ముకుంటున్నారు. చివరికి యూరియా పంపిణీ చేసే తెలివితేటలు కూడా లేవా?. మా ప్రభుత్వంలో ఒక ఆటోరిక్షావాడిని పిలిచి ఒక 10 బస్తాల యూరియా తెచ్చిపెట్టమంటే , తీసుకెళ్లి పొలం కాడ పడేసేవాడు. రైతులు చెప్పులను క్యూలో పెట్టాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడేదే యాపో బోపో తెచ్చారు. అది నడవట్లేదు. పీకట్లేదు. ఎరువు బస్తాకు యాప్ ఎందుకు? నాకర్థం కాదు’’ అని కేసీఆర్ అన్నారు.

Read Also- Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం

Just In

01

Fire Accident: నారాయణఖేడ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 3 వేల క్వింటాళ్ల పత్తి దగ్ధం

Shambhala: నేచురల్ స్టార్ వదిలిన ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Meera Raj: హాట్ టాపిక్‌గా ‘స‌న్ ఆఫ్’ బ్యూటీ.. ‘కాంచ‌న 4’లో ఛాన్స్!

Medical Mafia: అర్హత లేకుండా ఖరీదైన వైద్యం.. మిర్యాలగూడలో మెడికల్ మాఫియా