Vishnuvardhan Rao: ప్రభుత్వ అధీనంలో ఉన్న అటవీ భూమిపై ప్రయివేట్ వ్యక్తుల కన్ను పడ్డది. ఈ భూమిని దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం సాహెబ్ నగర్ రెవిన్యూ పరిధిలోని 201/1 సర్వే నెంబర్లో 102 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తమదని నిజాం వారసుల పేరుతో రంగారెడ్డి జిల్లా, హై కోర్టులో వాదించి గెలిచారు. అయితే అటవీ శాఖ అధికారి విష్ణువర్ధన్ రావు(Vishnuvardhan Rao) తగిన ఆధారాలతో సుప్రీం కోర్టును అశ్రాయించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు అటవీ శాఖకే సంబందించిన భూమిగా పరిగణిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.
Also Read: Harish Rao: ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరు తొలగించడం ఆక్షేపణీయం : మాజీ మంత్రి హరీష్ రావు
సరైన ఆధారాలతో..
2016లో ఓడిన కేసును అటవీ శాఖ అధికారి విష్ణువర్ధన్ రావు సరైన ఆధారాలతో సుప్రీంకోర్టు ముందు ఉంచారు. ఈ తీర్పుతో అధికారులు శనివారం సర్వే చేపట్టడం జరిగింది. సర్వే అనంతరం హద్దు రాళ్ళను అటవీ శాఖ, రెవిన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సుప్రీంకోర్టు(Suprime Cort)కు వెళ్లి అటవీ శాఖ అధికారి తీసుకున్న చొరవకు సంబంధిత ఉన్నత అధికారులు విష్ణువర్ధన్ రావును అభినందిస్తున్నారు. రూ.15వేల కోట్ల భూమిని తిరిగి తీసుకురావడం, అటవీ శాఖలో ఒక మైలురాయి అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Also Read: Google Alert: దయచేసి అమెరికా వదిలి వెళ్లకండి.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్.. ఎందుకంటే?

