AndhraKing Taluka OTT: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ డేట్ ఫిక్స్..
andhra-king-taluka-ott(x)
ఎంటర్‌టైన్‌మెంట్

AndhraKing Taluka OTT: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

AndhraKing Taluka OTT: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఆంధ్రకింగ్ తాలూకా’. నవంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను ఓటీటీలో మిస్ అయిన రామ్ అభిమానులు ఓటీటీ వార్త విని సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Avatar3 Box Office: ‘అవతార్ 3’ తొలిరోజు ప్రపంచ వసూళ్లు చూస్తే మతి పోవాల్సిందే?.. ఇండియాలో ఎంతంటే?

ఒక అభిమాని కథాంశంతో (Biopic of a Fan) తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ పోతినేని తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా భువనగిరి ప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ పలికించిన ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ థియేటర్ల వద్ద విజిల్స్ వేయించాయి. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండటంతో వ్యూయర్‌షిప్ భారీగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

Read also-Dandora Movie Trailer: శివాజీ ‘దండోరా’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ మత్తు దిగాలంటే టైమ్ పట్టుద్ది సార్..

రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా మహేష్ బాబు పి. దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఆంధ్రకింగ్ తాలూకా’ ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటించగా, వివేక్ – మెర్విన్ అందించిన అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం సినిమా విజయానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ భావోద్వేగ ప్రయాణాన్ని అందించనుంది.

Just In

01

Farmer Death: దౌల్తాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి!

Google Alert: దయచేసి అమెరికా వదిలి వెళ్లకండి.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్.. ఎందుకంటే?

Jupally Krishna Rao: తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవల అభినందనీయం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Bharani- Suman Shetty: పవన్ కళ్యాణ్ పాటకు భరణి సుమన్ శెట్టి డాన్స్ చూశారా.. ఇరగదీశారుగా..

Congress Leaders on BJP: వీళ్లు గాడ్సే వారసులు.. మోదీ, అమిత్ షాకు గుణపాఠం తప్పదు.. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్!