Pidamarthi Ravi: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి కోరారు. హైదరాబాద్‌లో మంత్రిని పలువురు ఉద్యమకారులు కలిసి వినతిపత్రం అందజేశారు.
Also Read: MP Mallu Ravi: అహంతోనే గాంధీ పేరు తొలగింపు.. కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజం
250 గజాల ఇంటి స్థలానికి లబ్ధిదారులుగా చేకూర్చాలి
ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు, జైలుకు వెళ్ళని వారు, ఉద్యమంలో పాల్గొన్న అందరికీ 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. చాలామంది ఉద్యమకారులపై కేసులు కాలేదని, అలాంటి వారిని కూడా గుర్తించి 250 గజాల ఇంటి స్థలానికి లబ్ధిదారులుగా చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. 250 గజాల ఇంటి స్థలం కోసం ప్రత్యేకమైన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
Also Read: MP Mallu Ravi: ఉపాధి హామీకి పేరు మార్పు ఎందుకు? ప్రజలే బుద్ధి చెబుతారు: ఎంపీ మల్లు రవి

