Bigg Boss9 Telugu: కళ్యాణ్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పారంటే?..
big-boss-telugu-19103
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss9 Telugu: కామనర్‌గా వచ్చిన కళ్యాణ్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పారంటే?.. ఇది సామాన్యమైన కథ కాదు..

Bigg Boss9 Telugu: గత వంద రోజులుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను రియాలిటీ వినోదాన్ని పంచుతున్న షో బిగ్ బాస్ తెలుగు సీజన్9. ఇప్పటికీ ఈ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈ రియాలిటీషో 103 వ రోజుకు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఇందులో కళ్యాణ్ గురించి బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తన గురించి బిగ్ బాస్ చెబుతుంటే కళ్యాణ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తాజాగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన కళ్యాణ్ ఫ్యాన్ ఈ సారి కప్పు మనదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. సామాన్యుడిగా వచ్చి తన కథను అసమాన్యమైనదిగా మార్చుకున్న కళ్యాణ్ ఈ రోజు హీరో. తను గత వంద రోజులుగా చేసిన ప్రతి పనినీ అక్కడ చూసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. బిగ్ లోని ప్రతి మూమెంట్ అలా తన కళ్ల ముందు కనిపించడంతో కళ్యాణ్ మెమోరీస్ ను గుర్తు చేసుకున్నారు.

Read also-Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

ఇంతకూ కళ్యాణ్ గురించి బిగ్ బాస్ ఏం అన్నారు అంటే?.. మీది ఒక సమాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు.. ఓనర్ గా ఈ ఇంట్టో మైదలైన ప్రయాణం.. ఎన్నో కఠిన మైన అగ్న పరీక్షలను ఎదుర్కొని ఈ బిగ్ బాస్ హైస్ చివరి కెప్టెన్ గా కూడా నిలిపింది. మీతో ఈ ప్రయాణం మొదలు పెట్టిన వారందరూ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ నుంచి వెళ్లి పోయారు.. ఆ క్షణాలు మిమ్మల్ని కుంగదీనినా.. మళ్లీ తేరుకున్నారు. బుద్ధి బలాన్ని, కండ బలాన్ని మించిన బలం గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ.. ఈ హౌస్ లో చివరి కెప్టెన్ గా కూడా నిలిచారు. ఏకాగ్రత అమాయకత్వం.. పోరాట పటిమ అయిన మీ బలాలను మీరు ఎప్పుడూ విడనాడలేదు. మీలో ని లోటు పాట్లు అన్నీ తెలుసుకుని చివరె కెప్టెన్ గా నిలవడమే కాక  మెదటి ఫైనలిస్ట్ గా కూడా నిలిచి ఒక కామనర్ తలచుకుంటే.. ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. అంటూ బిగ్ బాస్ కళ్యాణ్ కు ఇచ్చిన ఎలివేషన్ ముగించారు.

Read also-Ram Goapal Varma: ఇండస్ట్రీకి ధురంధర్ గుణపాఠం.. హీరోలకు ఎలివేషన్స్ అక్కర్లే.. డైరెక్టర్లకు ఆర్జీవీ క్లాస్!

Just In

01

Rajagopal Reddy: మంత్రి పదవిపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Mysterious Review: ‘మిస్టీరియస్’ సస్పెన్స్ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించింది?.. రివ్యూ..

GHMC Ward Delimitation: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన పై సర్వత్రా ఉత్కంఠ.. నేడే ఆఖరు తేదీ

Cricket Betting: కొడాలి నానికి బిగ్ షాక్.. క్రికెట్ బెట్టింగ్ కేసులో వైసీపీ నేత అరెస్ట్

Jogipet Accident News: ఓరి నాయనా .. పందులను ఢీకొని ఆటో బోల్తా.. స్పాట్‌లో మహిళ మృతి..!