MP Mallu Ravi: ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అత్యంత దారుణమని కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి (MP Mallu Ravi) విమర్శించారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రామీణ్ వీబీ జీరామ్‌జీ బిల్లు-2025తో రాష్ట్రాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని మల్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: MP Mallu Ravi: త్వరలో బీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ పొత్తు.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
షరతులు విధించడం సరైన పద్ధతి కాదు
నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రాలకు షరతులు విధించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఈ కొత్త బిల్లు ద్వారా ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఉపాధి పథకానికి ఇచ్చే నిధులను కేంద్రం భారీగా తగ్గిస్తోందని ఎంపీ విమర్శించారు. కేవలం మెజార్టీ ఉందన్న అహంకారంతోనే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
రాజీలేని పోరాటం చేస్తాం
ఈ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, కేవలం నాలుగు గంటల చర్చతోనే ముగించాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. గాంధీ పేరును తొలగించడం ద్వారా బీజేపీ తన సంకుచితత్వాన్ని చాటుకుంటోందని రవి పేర్కొన్నారు. గ్రామీణ పేదల బతుకుదెరువుకు ఆధారమైన పథకానికి తూట్లు పొడిచేలా ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనిపై తాము రాజీలేని పోరాటం చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.
Also Read: High Court: మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. నల్లపురెడ్డిపై హైకోర్టు సీరియస్

