Shocking Crime: అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మానసిక ఆరోగ్య సమస్యలు ఒక కుటుంబాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. 28 ఏళ్ల అభిజిత్ పటేల్ (Abhijit Patel) అనే యువకుడు తన తండ్రిని అత్యంత క్రూరంగా సుత్తితో కొట్టి హత్య చేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అభిజిత్ పటేల్ నివసిస్తున్న ఇంట్లోనే జరిగింది. తన తండ్రిపై సుత్తితో దాడి చేసి, ఆయన ప్రాణాలు తీసిన అనంతరం అభిజిత్ చాలా ప్రశాంతంగా తన తల్లి వద్దకు వెళ్లి.. ‘నేను నాన్న పని పూర్తి చేశాను’ అని చెప్పడం చూస్తుంటే.. అతని మైండ్‌సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ మాటలు విని షాక్‌కు గురైన తల్లి, లోపలికి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి తల్లడిల్లిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
Also Read- The Raja Saab: ‘సహన సహన..’ సాంగ్ వచ్చేసింది.. ఈ పాట ఓకే!
జరిగింది ఇదే..
అనుపమ్ పటేల్‌కు భార్య, కొడుకు ఉన్నారు. అనుపమ్ పటేల్ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు తన భార్యకు ఫోన్ చేసి బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి చెబుతుంటాడు. అంతేకాదు, అతని గ్లూకోజ్ మానిటర్ భార్య ఫోన్‌కు కనెక్టై ఉంది. ఉదయం 5. 30 గంటలకు వర్క్‌కు వెళ్లే ఆమెకు హత్య జరిగిన రోజు తన భర్త నుంచి ఫోన్ రాకపోవడంతో, ఫోన్ ఓపెన్ చేసి గ్లూకోజ్ స్థాయిని పరిశీలించి షాకయిందట. అంతే, వెంటనే ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో 10.30 గంటల సమయంలో ఆమె ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్లే సరికి కొడుకు ఇంటి బయట కూర్చుని.. నాన్న పని పూర్తి చేశాలే అని సమాధానమిచ్చాడట. ఆ మాటలతో ఆమెకు అనుమానం వచ్చి, వెళ్లి తలుపు తీసి చూడగా నెత్తుటి మడుగులో భర్త పడి ఉండటంతో భయపడిపోయి.. వెంటనే పోలీసులకు కాల్ చేసింది. పోలీసులు వచ్చి అనుపమ్ పటేల్‌ను ఆస్పత్రికి తరిలించినా లాభం లేకపోయింది. హత్య జరిగిన స్థలంలో పోలీసులకు పెద్ద సుత్తి లభించింది. ఆ సుత్తితోనే తన తండ్రిని చంపి ఉంటాడనే పోలీసులు అనుమానించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తలకు తీవ్ర గాయాలు అవడంతో పాటు పుర్రె, ముక్కు ఎముక విరిగినట్లుగా పోలీసులు తెలిపారు.
Also Read- Shambhala: టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల చేతుల్లోకి ‘శంబాల’.. రిలీజ్‌కు ముందే లాభాల్లో!
ట్విస్ట్ ఏంటంటే..
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకముందే అభిజిత్ స్వయంగా లొంగిపోయాడు. విచారణలో అతను చెప్పిన కారణాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి. తన తండ్రి చిన్నతనంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అందుకే ఆయనను చంపడం తన మతపరమైన బాధ్యత అని అభిజిత్ పేర్కొన్నాడు. అయితే, అభిజిత్ గత కొంతకాలంగా ‘షైజోఫ్రెనియా’ (Schizophrenia) అనే తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు ధృవీకరించారు. అంతకు ముందు చాలా సార్లు దీని నిమిత్తం ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో అభిజిత్ తన తండ్రిపై చేసిన ఆరోపణలను వైద్యులు కొట్టిపారేశారు. అతను ఎదుర్కొంటున్న మానసిక స్థితి కారణంగానే ఇలాంటి భ్రమలకు లోనవుతున్నాడని వారు అభిప్రాయపడ్డారు. షైజోఫ్రెనియా ఉన్న రోగులు తరచుగా లేని విషయాలను ఉన్నట్లు ఊహించుకోవడం, ఎవరో తమను వేధిస్తున్నారని లేదా తమకు దైవిక ఆదేశాలు వస్తున్నాయని నమ్మడం వంటివి చేస్తుంటారు. ఈ కేసులో కూడా అభిజిత్ తన తండ్రిపై పెంచుకున్న ద్వేషం కేవలం అతని మానసిక స్థితి సృష్టించిన భ్రమ మాత్రమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం అభిజిత్ పోలీసు కస్టడీలో ఉన్నాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

