Farmer Sells Kidney: వడ్డీపై అప్పులు తీసుకొని, ఆ డబ్బుని వ్యవసాయానికి పెట్టి, పంటలు దెబ్బతినడంతో అప్పులు చెల్లించలేని స్థితిలో నానా అవస్థలు ఎదుర్కొంటున్న రైతులు దేశవ్యాప్తంగా లెక్కకు మించే ఉన్నారు!. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వడ్డీ వ్యాపారులు అమానవీయ చర్యకు పాల్పడ్డారు. కేవలం లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చి, రోజుకు రూ.10 వేలు వడ్డీ విధించారు. దారుణాతి దారుణమైన ఈ దోపిడితో సదరు రైతు తీసుకున్న లక్ష రూపాయల అప్పు అనతికాలంలోనే ఏకంగా 74 లక్షల రూపాయలకు పెరిగిపోయింది. దీంతో, దిక్కుతోచని స్థిలో ఉన్న ఇల్లు, పొలాలు, ట్రాక్టర్‌తో పాటు కిడ్నీని కూడా (Farmer Sells Kidney) అమ్ముకున్నాడు. అత్యంత అమానవీయమైన ఈ ఘటన (Viral News) మహారాష్ట్రలో వెలుగు చూసింది.
Read Also- Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన
మహారాష్ట్రలోని (Maharastra) చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే ఓ రైతు వ్యవసాయం చేసేందుకుగానూ రోజుకు పది వేలు వడ్డీ చొప్పున రూ.రూ. 1 లక్ష అప్పు తీసుకున్నాడు. వ్యవసాయంలో వరుసగా నష్టాలు రావడంతో డెయిరీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే పలువురు వడ్డీ వ్యాపారుల నుంచి మొత్తం రూ.1 లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే, దురదృష్టం కొద్దీ డెయిరీ వ్యాపారాన్ని మొదలుపెట్టకముందే అతడు కొన్న ఆవులు చనిపోయాయి. ఇదే సమయంలో వ్యవసాయం కూడా కలిసిరాలేదు. పంటలు దెబ్బతిన్నాయి. దీంతో, ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వ్యవసాయం కలిసి రాలేదనే మానవత్వం కూడా లేకుండా వడ్డీ వ్యాపారులు రైతు రోషన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టారు. కాగా, కిషోర్ బావంకులే, మనీష్ కాల్బండే, లక్ష్మణ్ ఉర్కుడే, ప్రదీప్ బావంకులే, సంజయ్ బల్లార్‌పురే, లక్ష్మణ్ బోర్కర్ అనే వడ్డీ వ్యాపారుల నుంచి ఈ డబ్బు తీసుకున్నారు. వీళ్లంతా మహారాష్ట్రలోని బ్రహ్మపురి పట్టణానికి చెందినవారు.
Read Also- Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన
వడ్డీ వ్యాపారుల బాధ తట్టుకోలేక, తన భూమి, ట్రాక్టర్, విలువైన ఇంట్లోని వస్తువులను రోషన్ అమ్మేశాడు. అవన్నీ అమ్మేసిన తర్వాత కూడా అప్పు ఇంకా మిగిలే ఉంది. అయినప్పటికీ వడ్డీ వ్యాపారస్తులు వదిలిపెట్టలేదు. వడ్డీ వ్యాపారులలో ఒకరు కిడ్నీ అమ్ముకొని అప్పు తీర్చమంటూ సలహా ఇచ్చారు. దీంతో, ఒక ఏజెంట్ ద్వారా రోషన్ కోల్‌కతాకు వెళ్లాడు. అక్కడ పరీక్షలు జరిపిన తర్వాత, అక్కడి నుంచి కంబోడియాకు వెళ్లాడు. అక్కడ తన కిడ్నీని రూ.8 లక్షలకు రోషన్ అమ్ముకున్నారు.
న్యాయం చేయకపోతే చనిపోతా
తన పరిస్థితిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని రైతు రోషన్ వాపోతున్నారు. వడ్డీ వ్యాపారస్తుల కారణంగా తాను మానసిక, శారీరక బాధను అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకొని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయం జరగకుంటే తాను, తన కుటుంబం ముంబైలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం ‘మంత్రాలయ భవనం’ ముందు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు.

