Bondi Beach Attack: బోండీ దాడి టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాదే
Sajid-Akram (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన

Bondi Beach Attack: ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీలో ఉన్న బోండీ బీచ్‌లో (Bondi Beach Attack) ఆదివారం భయానక ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. యూదులే లక్ష్యంగా బీచ్‌లో జరుగుతున్న ‘హనుక్కా’ ఉత్సవంలో పాల్గొన్నవారిపై నరమేధానికి పాల్పడ్డారు. తుపాకీలతో కాల్పులు జరిపి మారణకాండ జరిపి 15 మందిని పొట్టనపెట్టుకున్నారు. సాజిద్‌ అక్రమ్, అతడి కొడుకు నవీద్‌ అక్రమ్‌ (24) ఈ దాడికి పాల్పడినట్టు ఇప్పటికే తేలింది. అయితే, ఈ ఇద్దరి ఉగ్రవాదుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి చెందినవాడని గుర్తించారు. ఈ విషయాన్ని నిర్ధారించిన తెలంగాణ డీజీపీ కార్యాలయం మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.

సాజిద్‌ హైదరాబాద్ వాసి అని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సాజిద్ హైదరాబాద్‌లోనే బీకామ్ చేశాడు. 1998 నవంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లాడు. ఉద్యోగం కోసమే వెళ్లాడు. 27 ఏళ్లలో ఇండియాకి ఆరు సార్లు మాత్రమే వచ్చాడు. తండ్రి మరణించినప్పుడు కూడా ఇండియాకి రాలేదు’’ అని వివరించారు. చివరిసారిగా 2022లో వచ్చాడని పేర్కొన్నారు. 1998లోనే అతడు ఆస్ట్రేలయాకు వెళ్లినట్టు గుర్తించామని, అయినప్పటికీ అతడు ఇంకా భారతీయ పాస్‌పోర్టు హోల్డర్‌గా ఉన్నాడని వివరించారు.  అతడి కొడుకు నవీద్ అక్రమ్‌కు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని ప్రకటనలో తెలంగాణ డీజీపీ కార్యాలయం పేర్కొంది.

Read Also- Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

రంగంలోకి ఇంటెలిజెన్సీ… 

సాజిద్ అక్రమ్ సోదరుడు పేరు షాహిద్ అక్రమ్ అని పేర్కొన్నారు. షాహీద్ అక్రమ్ టోలీచౌకీలో నివాసం ఉంటున్నాడని వివరించారు. షాహీద్ గత కొంతకాలంగా డాక్టర్‌గా పని చేస్తున్నాడని, అతడి గురించి ఇంటెలిజెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పారు. షాహీద్ అక్రమ్ కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నామన్నారు.

స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌కు చెందిన మూడు బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. గతంలో సాజిద్ ఎన్ని సార్లు హైదరాబాద్‌కు వచ్చాడు అన్నదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉగ్రవాది కాదు

సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మంచిగానే ఉండేవాడని, అప్పుడు అతడికి ఎలాంటి ఉగ్రవాద సంబంధాలు లేవని తెలంగాణ డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఆస్ట్రేలియాలో అతడు ఉగ్రవాదిగా మారడానికి భారత్‌తో ఎలాంటి సంబంధం లేదని, తెలంగాణలో ఉన్నప్పుడు అతడిపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది.

కాగా, ఉగ్రదాడి సమయంలో ఓ పోలీసు అధికారి జరిపిన క్రాస్‌ఫైర్‌లో ఉగ్రవాది సాజిద్ అక్రమ్ చనిపోయాడు. కొడుకు నవీద్ మాత్రం బుల్లెట్ గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

Read Also- Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

క్రైస్తవ మహిళను పెళ్లి చేసుకోవడంతో కుటుంబం దూరం

సాజిద్ అక్రమ్ కుటుంబ సభ్యులు ఒక రెండు మీడియా సంస్థలతో మాట్లాడుతూ, కీలక విషయాలు వెల్లడించారు. సాజిద్ అక్రమ్ ఓ క్రైస్తవ మహిళను పెళ్లి చేసుకోవడంతో తమ కుటుంబం అతడితో సంబంధాలను తెంచుకుందని చెప్పారు. చాలా కాలంగా అతడికి దూరంగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, సాజిద్ ఆస్ట్రేలియాలో స్థిరపడక ముందు, యూరోపియన్ సంతతికి వెనెరా గ్రోసో (Venera Grosso) అనే క్రిస్టియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ నవీన్‌‌తో పాటు ఒక కూతురు కూడా ఉంది. పిల్లలు ఇద్దరికీ ఆస్ట్రేలియా పౌరసత్వాలు ఉన్నాయి.

Just In

01

Jana Sena Party: రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం.. కీలక అంశాలపై చర్చ..?

Farmer Sells Kidney: రోజుకు రూ.10 వేల వడ్డీతో రూ.1 లక్ష అప్పు.. భారం రూ.74 లక్షలకు పెరగడంతో కిడ్నీ అమ్ముకున్న రైతు

Polling Staff Protest: మధ్యాహ్న భోజనం దొరకక ఎన్నికల పోలింగ్ సిబ్బంది నిరసన

Delhi Government: ఆ సర్టిఫికేట్ లేకుంటే.. పెట్రోల్, డీజిల్ బంద్.. ప్రభుత్వం సంచలన ప్రకటన

Champion: ‘ఛాంపియన్’ కోసం ‘చిరుత’.. శ్రీకాంత్ తనయుడికి కలిసొచ్చేనా?