Viral Video: రూ.70 లక్షల బాణాసంచా.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైరల్!
Viral Video (Image Source: Twitter)
Viral News

Viral Video: రూ.70 లక్షల బాణాసంచా.. గ్రాండ్ డెకరేషన్.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైరల్!

Viral Video: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు అంజనేశ్ వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చను లేవనెత్తింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఏడాది జరిగిన అత్యంత చర్చనీయాంశమైన ఈవెంట్లలో ఒకటిగా ఎమ్మెల్యే కుమారుడి వివాహం మారిపోయింది. పెళ్లి వేడుకలు జరిగిన తీరు, ఆర్భాటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒక ఎమ్మెల్యే కుమారుడి వివాహం ఈ స్థాయిలో జరగడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

హిందూ దేవతల విగ్రహాలు

వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలిస్తే పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అతిథులు, రాజకీయ ప్రముఖులు వెడ్డింగ్ కు హాజరయ్యారు. ఓ వీడియోలో కేవలం బాణాసంచా కోసమే రూ.70 లక్షలు ఖర్చు అయినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇక సంప్రదాయ వెడ్డింగ్ వేదికలకు భిన్నంగా ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి వేదికను సిద్ధం చేశారు. ప్రాంగణం అంతటా హిందూ దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై భారీ శివుడి విగ్రహాన్ని పెట్టారు. ఆయన ముందు నూతన వధూవరులు దండలు మార్చుకొనగా.. శివుడి వెనక భాగంలో పెద్ద ఎత్తున తారా జువ్వలు ఎగసిపడటం వైరల్ వీడియోల్లో హైలెట్ గా నిలుస్తోంది.

ఖరీదైన పెళ్లి వస్త్రాలు

అటు పెళ్లి రోజున అంజనేశ్ ఖరీదైన షెర్వాణీ ధరించగా.. వధువు సిమర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. వధువు ధరించిన దుస్తులను ప్రముఖ డిజైనర్లు రింపుల్ & హర్ ప్రీత్ రూపొందించడం విశేషం. మరోవైపు ఇండోర్‌లోని ఖజురానా ఆలయంలో మూల విరాట్ ముందు వధూవరులు పూల దండలు మార్చుకున్న వీడియో ఒకటి కూడా వైరల్ అవుతోంది. సాధారణంగా ఆ ఆలయంలో మూల విరాట్ వద్దకు సాధారణ భక్తులను అనుమతించరని.. కనీసం ఫొటోలు – వీడియోలు కూడా నిషిద్దమని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలను అంజనేశ్ సోదరుడు రుద్రాక్ష్ శుక్లా షేర్ చేశారు.

Also Read: UN Security Council: స్నేహంతో సింధూ నీరు ఇస్తే.. యుద్ధాలు, ఉగ్రదాడులు తిరిగిచ్చింది.. పాక్‌పై భారత్ ఫైర్

నెటిజన్లు మండిపాటు

అయితే ఈ పెళ్లి వేడుకపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క బాణాసంచాకే రూ.70 లక్షలు ఖర్చు చేస్తే.. ఇక పెళ్లికి ఎన్ని రూ. కోట్లు ఖర్చు చేసుంటారో అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రజా ధనాన్ని దోచుకొని ఇలా కుమారుడి పెళ్లిని గ్రాండ్ గా సదరు ఎమ్మెల్యే చేశారని ఆరోపిస్తున్నారు. అయితే సాధారణ చిరు వ్యాపారులను పట్టిపీడించే ఆదాయపన్ను శాఖ అధికారులు.. ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసిన ఎమ్మెల్యేను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ఓ యూజర్ ప్రశ్నించారు. కాగా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై ఎమ్మెల్యే కుటుంబం ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈ వివాహానికి బీజేపీతో పాటు కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

Also Read: Panchayat Election: ఉత్కంఠగా పంచాయతీ ఎన్నికలు.. ఒక్క ఓటుతో అభ్యర్థుల గెలుపు!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?