Mathura Bus Fire: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలో ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 4 గంటల సమయంలో చోటుచేసుకోగా, మూడు కార్లు , ఏడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడు బస్సుల్లో ఆరు స్లీపర్ బస్సులు కాగా, ఒకటి రోడ్వేస్ బస్సుగా అధికారులు తెలిపారు.
మథురా గ్రామీణ ఎస్పీ సురేష్ చంద్ర రావత్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం అనంతరం అన్ని బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన తెలిపారు. “రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది,” అని ఎస్పీ వెల్లడించారు.
సీఎం యోగి ఆదేశాలు
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే స్పందించారు. ఘటనాస్థలికి అధికారులు, సహాయక బృందాలను పంపించి రక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం ఆదేశించినట్లు మథురా జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాష్ సింగ్ తెలిపారు.
Also Read: MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు
అగ్నిమాపక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే 11 అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి తరలించారు. బస్సులన్నింటిలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.

