Drug Seizure:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు, లంగర్ హౌస్ పోలీసులతో కలిసి మాదక ద్రవ్యాల దందా చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు. వారితోపాటు డెలివరీ బాయ్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 70 లక్షల రూపాయల విలువ చేసే హ్యాష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం (Drug Seizure) చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన, ప్రస్తుతం మాదాపూర్‌లో ఉంటున్న వైకుంఠ రావు (33) వృత్తి రీత్యా మేస్త్రీ. 10వ తరగతితో చదువు ఆపేసిన వైకుంఠ రావు దేశంలోని వేర్వేరు సిటీల్లో పని చేస్తూ వచ్చాడు. మొదట చెన్నైలో మేస్త్రీగా పని చేసి ఆ తరువాత హైదరాబాద్ వచ్చి క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగం చేశాడు. 2015లో స్వస్థలానికి వెళ్లిపోయి గొర్రెల పెంపకం చేపట్టి నష్టాలపాలై నాలుగేళ్లపాటు తిరిగి ఇక్కడికి వచ్చి క్యాబ్ డ్రైవర్ గా కొనసాగుతున్నాడు.
Read Also- Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!
కాగా, ఇదే వృత్తిలో ఉన్న కొందరు వైకుంఠ రావు ద్వారా ధూల్ పేట నుంచి గంజాయి తెప్పించుకుని సేవించేవారు. ఈ క్రమంలో అతనికి గంజాయి దందా చేస్తున్న వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. దాంతో తేలికగా డబ్బు సంపాదించాలని తానే గంజాయిని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మటం మొదలు పెట్టాడు. ఈ రుచి మరిగిన వైకుంఠ రావు ఒడిషా నుంచి గంజాయి తెచ్చి అమ్మితే మరింత ఎక్కువుగా లాభాలు సంపాదించ వచ్చని ఆ రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన కృష్ణ జల్లా (31)తో పరిచయం ఏర్పరుచుకున్నాడు. తరచూ గంజాయితోపాటు హ్యాష్ ఆయిల్ తీసుకు వస్తూ ఇక్కడ అమ్ముతున్నాడు.
Read Also- Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!
ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డ వైఖరిని మాత్రం మార్చుకోలేదు. తనకు బంధువులైన మల్కాజిగిరి నివాసి బాలాజీ (42), చైతన్య (17)లను డెలివరీ బాయ్స్ గా పెట్టుకుని అక్రమ దందా కొనసాగిస్తూ వస్తున్నాడు. కాగా, హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ డేనియల్, ఎస్ఐ రాములు, లంగర్ హౌస్ సీఐ వెంకటరాములు, ఎస్ఐ రాంబాబుతో కలిసి కొనసాగుతున్న దందా గురించి పక్కగా సమాచారాన్ని సేకరించారు. స్పెషల్ ఆపరేషన్ జరిపి వైకుంఠ రావు, కృష్ణ జల్లా, బాలాజీ, చైతన్యలను అరెస్ట్ చేశారు. వారి నుంచి అయిదు కిలోల హ్యాష్ ఆయిల్, అయిదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చాలా రోజులుగా ఈ దందాలో ఉన్న వైకుంఠ రావు కస్టమర్లు హైదరాబాద్ లో పదుల సంఖ్యలో ఉన్నట్టు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చెప్పారు.
కోడ్ వర్డ్‌తో…
పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వైకుంఠ రావు అన్ని జాగ్రత్తలు తీసుకునే వాడని తెలిపారు. తన వద్దకు మాదక ద్రవ్యాలు రాగానే ఫోన్ స్టేటస్ లో ‘గ్రీన్ అవైలబుల్’ అని స్టేటస్ పెట్టేవాడని చెప్పారు. ఇక, మధ్యాహ్నం 1గంట నుంఇ సాయంత్రం 4గంటల మధ్య మాత్రమే వాటిని విక్రయించే వాడని వివరించారు. మాదక ద్రవ్యాల దందా గురించి తెలిస్తే 8712661601 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.

