Road Accident: గ్రామపంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు ను వినియోగించు కొనేందుకు కుటుంబంతో సహా వెళ్తున్న 4 గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా(Medak district) కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన భార్యా, భర్త, కుమారుడు కూతురు, మృతి చెందారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళుతూ ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది.
Also Read: Ustaad BhagatSingh song: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ టైమ్‌కి రెడీగా ఉండండి.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..
ఓటు వేసేందుకు..
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన కురుమ లింగమయ్య(Kuruma Lingaiah) 45. కురుమ సాయవ్వ(Kuruma Sayavva) 40 కుమారుడు సాయిలు(Sailu) 18 కూతురు మానస(Manasa) 8 ఒకే కుటుంబానికి చెందినవారు. వారు మోటార్ సైకిల్ పై హైదరాబాద్(Hyderabad) నుంచి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.. సమాచారం తెలుసుకున్న వెంటనే అల్లాదుర్గం ఎస్సై శంకర్. పెద్ద శంకరంపేట ఏఎస్ఐ సంగమేశ్వర్ లు వివరాలు సేకరిస్తున్నారు.. రెండవ విడతలో భాగంగా నిజాంసాగర్ మండలం మాగి గ్రామపంచాయతీలో ఓటు వేసేందుకు హైదరాబాదు నుండి సొంత గ్రామానికి బైక్ పై వస్తుండగా పెద్ద శంకరంపేట శివారులోని 161 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు వివరాలు సేకరించడంతో పాటు మృతదేహాలను పోస్టుమార్టం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

