Ustaad BhagatSingh song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి మొదటి సింగిల్ విడుదల అయ్యే టైం రానే వచ్చింది. ఈ పాటకు సంబంధించి రిలీజ్ టైం ఎప్పుడనేది చెప్పేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి మొదటి సింగిల్ ను కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఉన్న ఆదిత్య యూనివర్సిటీలో ఈ పాటకు సంబంధించి ఈవెంట్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హాజరు కానున్నారు. అనంతరం సాయంత్రం 6:30 నిమిషాలకు పాటను విడుదల చేయనున్నారు. ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాట విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసందే. దీంతో ఈ సినమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Read also-Akhanda2 Premiere: ‘అఖండ 2’ డే 1 ప్రీమియర్స్ గ్రాస్ ఎంతో తెలుసా?.. ఫ్యాన్స్‌కు పండగే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మాస్ సినిమాల స్పెషలిస్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ (2012) ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అందుకే, దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ వీరు కలిసి పనిచేయడంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తమిళంలో విజయం సాధించిన ‘తేరి’ సినిమాకి అధికారిక రీమేక్ అనే టాక్ ఉన్నప్పటికీ, హరీష్ శంకర్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథను మార్చి, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ పోస్టర్‌లు పవన్ కళ్యాణ్ పవర్-ప్యాక్డ్ మాస్ అవతార్‌ను చూపిస్తూ అంచనాలను మరింత పెంచాయి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యువ నటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తుండడంతో, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ స్టైల్, హరీష్ శంకర్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలయికగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగలా ఉండే ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలు, పదునైన డైలాగులు, మాస్ మసాలా అంశాలతో నిండి ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఈ కాంబో ప్రేక్షకులకు మరొక మెగా హిట్‌ను అందిస్తుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి రాబోయే సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ పాట గురించి దర్శకుడు హరీష్ శంకర్ చేసిన్ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. అందులో పాటలోని కొన్ని చరణాలు రాసి ఇలా ఉండబోతుందని హింట్ ఇచ్చారు.
ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి
నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టి
పంపించేద్దాం సావగొట్టి
పోరాడితే … పోయేదేంటీ………
దేఖ్ లేంగే సాలా …….. ….
అన్నయ్య @bhaskarabhatla 🙏🙏🙏 https://t.co/PeGpHQRYgp
— Harish Shankar .S (@harish2you) December 13, 2025
A song that will be celebrated for ages 🕺🔥#UstaadBhagatSingh first single #DekhlengeSaala out today at 6.30 PM ❤🔥
Cult Captain @harish2you's Feast💥
A Rockstar @ThisisDsp Musical ❤️🔥
Sung by @vishaldadlani & #Haripriya
Lyrics @bhaskarabhatla… pic.twitter.com/us9FEvXJUH— Ustaad Bhagat Singh (@UBSTheFilm) December 13, 2025

