Akhanda2 Premiere: బాలయ్య బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ ఏ రేంజ్ లో హట్ అయిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వల్ గా వచ్చిన అఖండ 2: తాండవం సినిమా పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. అఖండ 2 తాండవం సినిమా కూడా దూసుకుపోతుంది. ప్రీమియర్లకు సంబంధించి అఫీషియల్ కలెక్షన్లను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ విడుదల చేసింది. ఈ సినిమా డే 1 ప్రీయర్లు రూపంలో రూ.59.5 కోట్లు సాధించింది. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రీమిర్లతోనే దాదాపు రూ.60 కోట్లు సాదిస్తే సినిమా మొత్తం అయిదు వందల కోట్లు కలెక్షన్లు దాటేస్తాయని అభినమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినమా అనిమార్య కారణాల వల్ల కొంత డిలే అయి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా..సినిమా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడంపై నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ ప్రకంపనలు. ఈ అంచనాలను అందుకుంటూ, 2021 నాటి ఘన విజయం ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందిన ‘అఖండ 2: తాండవం’ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 12, 2025) ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. అనేక ఊహించని ఆర్థిక, న్యాయపరమైన సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం, చివరికి విడుదల కావడం అభిమానులకు పెద్ద పండుగ వాతావరణాన్ని సృష్టించింది.
Read also-Fake Journalists: ఫ్లయింగ్ స్క్వాడ్ ముసుగులో బలవంతపు వసూళ్లు.. సిగ్నేచర్ స్టూడియో యాంకర్ అరెస్ట్!
సినిమాకు విమర్శకుల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చినా, మాస్ ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు మాత్రం థియేటర్లను షేక్ చేశారు. ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన అంశాలు ఏంటంటే?.. బాలకృష్ణ ద్విపాత్రాభినయం. అఘోరాగా శక్తివంతమైన పాత్రలో బాలకృష్ణ నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు పసందైన విందుగా నిలిచింది. ప్రధాన విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో థమన్ అందించిన BGM హైలైట్‌గా నిలిచింది. మొదటి భాగం స్థాయిలో కథనం లేదనే అభిప్రాయం కొంతమంది నుంచి వ్యక్తమైనప్పటికీ, బోయపాటి తనదైన మార్క్ యాక్షన్, ఎలివేషన్స్ ఇచ్చారు. వారాంతం కావడంతో, తొలి మూడు రోజులు ఈ చిత్రం వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
The DIVINE ROAR is heard LOUD & CLEAR 💥💥#Akhanda2 collects a gross of 59.5 CRORES+ on Day 1 (including premieres), making it the biggest opener for God of Masses #NandamuriBalakrishna ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8l5WolzzT6#Akhanda2Thaandavam… pic.twitter.com/YpXzF1xRyE— 14 Reels Plus (@14ReelsPlus) December 13, 2025

