Viral video: రైలు బోగిలో ఒంటరి మహిళ.. 40 మంది కుర్రాళ్లు వచ్చి..
Viral video (Image Source: AI)
అంతర్జాతీయం

Viral video: రైలులో భయానకం.. బోగిలో ఒంటరి మహిళ.. 40 మంది కుర్రాళ్లు గుంపుగా వచ్చి..

Viral video: బీహార్‌లోని కటిహార్ జంక్షన్‌లో ప్రయాణిస్తున్న రైలులో ఒంటరి మహిళకు భయంకర పరిస్థితి ఎదురైంది. టాయిలెట్ బయట ఒక్కసారిగా 30 – 40 మంది కుర్రాళ్లు గుంపుగా చేరడంతో ఆమె బయటకు రావడానికి భయపడి లోపలే ఉండిపోయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అక్కడికి వచ్చే వరకు ఆమె టాయిలెట్‌లోనే ఉండి వీడియోను రికార్డు చేయాల్సి వచ్చింది. తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని వివరిస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?

ఎక్స్ లో పెట్టిన పోస్టులో ఆమె తన అనుభవాన్ని వివరించింది. కటిహార్ జంక్షన్‌లో రైలు ఆగిన సమయంలో ఒక్కసారిగా పెద్ద కలవరం మెుదలైందని ఆమె పేర్కొంది. తాను వాష్‌రూమ్‌కు వెళ్లి బయటకు రావడానికి సిద్ధమవుతున్న సమయంలో డజన్ల కొద్ది పురుషులు.. కేకలు వేస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ కోచ్‌లోకి దూసుకొచ్చారని చెప్పింది. వారంతా టాయిలెట్ బయటే గుంపుగా ఉండిపోవడంతో తలుపు పూర్తిగా తెరవలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపింది. అభద్రతా భావంతో వెంటనే బాత్రూమ్ డోర్ ను మూసివేసినట్లు బాధితురాలు స్పష్టం చేసింది. భయంతో రైల్వే హెల్ప్‌లైన్ (139)కు ఫోన్ చేసినట్లు తెలిపింది.

సకాలంలో స్పందించిన ఆర్పీఎఫ్..

అంతేకాదు బయట గుంపుగా ఉన్న మగవారి వల్ల తాను ఎంతగా భయపడ్డానో తెలియజేస్తూ వీడియోను సైతం ఆమె షేర్ చేశారు. టాయిలెట్ లోపల నుంచే ఒక వీడియోను ఆమె రికార్డు చేశారు. అయితే ప్రయాణంలో భద్రతాపరమైన భయాలు ఎందుకు వస్తాయో ఈ ఘటన ద్వారా ప్రత్యక్షంగా అనుభవించినట్లు బాధితురాలు తెలిపారు. అయితే కొద్దిసేపటి తర్వాత రైల్వే పోలీసులు తన బోగీలోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. వారు బయట ఉన్న కుర్రాళ్ల గుంపును పక్కకు జరిపి.. తన సీటు వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

Also Read: Trump vs Democrats: భారత్‌పై సుంకాలు.. ట్రంప్‌కు షాకిచ్చిన డెమోక్రాట్లు.. చట్టసభలో తీర్మానం

రైళ్లల్లో మహిళల భద్రతపై చర్చ

బాధిత మహిళ చేసిన తాజా పోస్ట్.. రైళ్లల్లో స్త్రీల భద్రతపై మరోమారు చర్చను లేవనెత్తింది. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఎదురయ్యే సవాళ్లను కళ్లకు కట్టింది. అయితే సమస్య ఎదురైనప్పుడు సదరు యువతి స్పందించిన తీరుపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె చాకచక్యంగా వ్యవహరించి తక్షణమే రైల్వే పోలీసుల సాయం కోరడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అటు రైల్వే పోలీసులు సైతం సకాలంలో స్పందించి.. బాధితురాలికి సాయం చేయడాన్ని ప్రశంసిస్తున్నారు. అటు బాధితురాలు కూడా ఆర్పీఎఫ్ సిబ్బందికి థ్యాంక్స్ చెప్పడం గమనార్హం.

Also Read: Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జోరు.. రాజీనామా హామీతో ప్రచారం!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క