Panchayat Elections: కామారెడ్డి జిల్లా పిట్లం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో, ఇక్కడ పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. ప్రధాన పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు ధీటుగా, ఆయన ఇంటింటికి వెళుతూ ప్రతీ ఓటరును కలుస్తున్నారు. నవాబ్ సుదర్శన్ గౌడ్ తన గుర్తు అయిన ఫుట్ బాల్కు ఓటు వేయాలని ప్రజలను అడుగుతూ, తాను గెలిస్తే మొదటి రెండున్నర సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
ప్రతీ సమస్యపై నాకు పూర్తి అవగాహన
ముఖ్యంగా, తన హామీలు నెరవేర్చని పక్షంలో, రాజీనామా చేసి సర్పంచ్ పదవి నుంచి తప్పుకొంటానని తెలియజేయడం ద్వారా ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ముప్పయ్యేళ్లుగా మీ మధ్యనే ఉన్నాను. గ్రామంలోని ప్రతీ సమస్యపై నాకు పూర్తి అవగాహన ఉంది. వాటిని ఎలా పరిష్కరించాలో కూడా తెలుసు” అని చెబుతూ, తనను గెలిపించి గ్రామాభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి ఇస్తున్న ఈ వినూత్న హామీ, పిట్లం ఎన్నికల ఫలితంపై ఆసక్తిని పెంచింది.
Also Read: Panchayat Elections: ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు.. 112 సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక నిఘా!

