VC Sajjanar: కొత్త నార్కోటిక్ టీమ్‌లు రంగంలోకి.. మాదకద్రవ్యాల
VC Sajjanar ( image credit: swetcha reporter)
హైదరాబాద్

VC Sajjanar: కొత్త నార్కోటిక్ టీమ్‌లు రంగంలోకి.. మాదకద్రవ్యాల మాఫియాపై సజ్జనార్ వార్నింగ్!

VC Sajjanar: డ్రగ్​ పెడర్లపై ఇక ముందు రౌడీషీటర్లపై పెట్టినట్టుగా కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్​ (VC Sajjanar) చెప్పారు. మాదక ద్రవ్యాల దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. డ్రగ్​ ఫ్రీ సిటీగా హైదరాబాద్​ ను మార్చటానికి  కేంద్ర, రాష్ట్ర ఏజన్సీలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్ల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తామో…డ్రగ్స్ దందా చేసే వారిపై కూడా అంతే తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాల నెట్​ వర్క్​ కు చెక్​ పెట్టటానికి నార్కొటిక్​ ఎన్​ ఫోర్స్​ మెంట్ వింగ్​ ను మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న బృందాలకు అదనంగా మరో నాలుగైదు కొత్త టీంలను రంగంలోకి దింపనున్నట్టు తెలిపారు.

ఈ బృందాలు కీలకంగా పని చేస్తాం

క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, నిందితుల అరెస్టుల్లో ఈ బృందాలు కీలకంగా పని చేస్తాయన్నారు. డ్రగ్స్​ మహమ్మారిని అరికట్టటానికి అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పని చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఇకపై ప్రతీనెలా ఆయా ఏజన్సీలతో సమీక్షా సమావేశాలు జరిపి కేసుల పురోగతిని తెలుసుకుంటానన్నారు. డ్రగ్స్​ ను కట్టడి చేయటానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తామన్నారు. పాత కేసుల్లోని నిందితుల కదలిలకపై కన్నేసి పెడతామని, అదే సమయంలో కొత్త కొత్త పద్దతుల్లో జరిగే డ్రగ్స్ దందాపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. డ్రగ్స్​ రవాణా, వినియోగంలో విదేశీయుల పాత్రపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు.

Also Read: VC Sajjanar: రాష్ట్రంలో సంచలన కేసుల విచారణ కోసం స్పెషల్ టీం ఏర్పాటు: వీసీ సజ్జనార్

కదలికలపై నిరంతర నిఘా పెట్టాలి

విమానాశ్రయాల్లో ఉండే ఫారినర్స్​ కౌంటర్ల సిబ్బంది నుంచి అందే సమాచారాంతో ఆయా ఏజన్సీలు అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్​ సరఫరాలో తరచూ కొరియర్ సంస్థల పాత్ర బయట పడుతున్న నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. మెడికల్ వీసాలపై వస్తూ ఎలాంటి వైద్యం చేయించుకోకుండా తిరుగుతున్న విదేశీయుల వ్యవహారాన్ని సీరియస్​ గా తీసుకోవాలన్నారు. సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఐబీ జాయింట్ డైరెక్టర్ తిరుగణన సంబంధన్​, డీఆర్​ఐ డిప్యూటీ డైరెక్టర్ గురు రాజేశ్​, ఎన్సీబీ అసిస్టెంట్ డైరెక్టర్ విష్ణువర్ధన్, ఈగల్​ ఫోర్ప్ డీఐజీ అభిషేక్ మహంతి, సీఐఎస్ఎఫ్​ డీఐజీ మొహంతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Also Read: VC Sajjanar: రాష్ట్రంలో సంచలన కేసుల విచారణ కోసం స్పెషల్ టీం ఏర్పాటు: వీసీ సజ్జనార్

Just In

01

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్