Gadwal District: ఉత్కంఠగా మారిన గద్వాల రాజకీయం
Gadwal District (imagecredit:twitter)
మహబూబ్ నగర్

Gadwal District: గ్రామాల్లో జోరందుకున్న ప్రలోభాల పర్వం.. ఉత్కంఠగా మారిన గద్వాల రాజకీయం

Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో రెండవ విడత ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. శుక్రవారంతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్,వార్డు స్థానాల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలోపడ్డారు. ఈ మేరకు శుక్రవారం నుంచే అభ్యర్థులు గ్రామాల్లో ఇంటింటికి మద్యం, చికెన్(Chiken) పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ చేయగా సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు ముందస్తుగా కొనుగోలు చేసి తమకు అనుకూలమైన స్థలంలో డంపు చేసుకుని ఇంటింటా పంపిణీ చేస్తున్నారు. దానికితోడు చికెన్ దుకాణాల యజమానులతో ఒక ధర నిర్ణయించుకొని ప్యాకెట్లలో అరకిలో చొప్పున ప్యాకింగ్ చేయించి గ్రామంలోనే ప్రతి గడపగడపకు వెళ్లి తిరుగుతూ ఈసారి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించడంతో పాటుగా ఒక చికెన్ ప్యాకెట్ మద్యం బాటిల్ కూల్ డ్రింక్స్ ను అందజేసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకుంటున్నారు.

జోరందుకున్న అభ్యర్థుల పంపకాలు

మొదటి విడత ఎన్నికల పోలింగ్ ముగియటంతో రెండో విడత పోలింగ్ కు అధికారులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగియడంతో అభ్యర్థులు చివరి సారిగా ఇంటింటికి తిరిగి ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకుంటూ తమ గుర్తును చూయిస్తున్నారు. దానికి తోడు పోలింగ్ కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇప్పటికే సిద్ధం చేసుకున్న మద్యం బాటిల్, కూల్ డ్రింక్స్, ఇతర వంట సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. యూత్ కు దావతులు ఇస్తున్నారు. విజయం ఎవరికి దక్కుతుందో కానీ ఓటర్లను తృప్తి పరచడంలో అభ్యర్థులు తగ్గట్లేదు.

Also Read: Akhanda2 Review: బాలయ్య బాబు ‘అఖండ 2 తాండవం’తో పూనకాలు తెప్పించారా?.. ఫుల్ రివ్యూ..

ఖర్చు బారెడు

ఓట్లు ఎటు పడుతాయో.. ఎవరు గెలుస్తారో పక్కన పెడితే రెండవ విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా విందులు, దావత్ లు కనిపిస్తున్నాయి. రాత్రి అయిందంటే చాలు దావతుల హడావిడి నడుస్తోంది. అభ్యర్థులు తమ గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా వెనుకడడం లేదు. ఖర్చు ఎంతైనా సరే గెలుపు ముఖ్యం అన్నట్లుగా సాగుతోంది.

రవాణా ఏర్పాట్లు

అభ్యర్థులు గ్రామంలో విస్తృత ప్రచారంతో పాటుగా గ్రామాలకు పట్టణాలు,నగరాల్లో ఉంటున్న వారిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణాల్లో ఇతర ప్రాంతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు నిమిత్తం ఉన్నవారికి అభ్యర్థులు ఫోన్ చేస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థించడంతో పాటుగా గ్రామానికి రావడానికి సైతం రవాణ ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేయడం లేదంటే రవాణ ఖర్చుల నిమిత్తం డబ్బులను ఆన్లైన్ ద్వారా పంపించడం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ ఎక్కువగా ఉండడంతో గ్రామం వెలుపల ఉండే ఓటర్లే వాటి విజయానికి దోహదం కానున్నారు. దీంతో పట్టణాల్లో ఇతర ప్రదేశాల్లో ఉండే వారికి ఖర్చు ఎంత పెట్టడానికైనా వెనుకాడడం లేదు.

మహిళలతో ఇంటింటా ప్రచారం

మూడు విడతల్లో ఎన్నికలు ఉండగా ఇప్పటికే ఒక విడత పూర్తి కాగా అభ్యర్థులు గ్రామాలలో మంది మార్బలంతో ర్యాలీలు నిర్వహించారు. గ్రామాల్లో ఒక్కొక్కరికి 300 నుంచి 500 వరకు చెల్లించి గ్రామంలో మహిళలను ర్యాలీగా తిప్పుతూ ఇంటింటా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అభ్యర్థుల ప్రచారం ప్రచార పాటలతో సందడి నెలకొంది.

Also Read: MLC Duvvada Srinivas: ఫార్మ్​ హౌస్​‌లో మందు పార్టీ.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి అరెస్ట్..!

Just In

01

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం

Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

Sydney: బ్రేకింగ్.. ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్‌లో కాల్పులు.. 10 మందికి గాయాలు

Ustaad BhagatSingh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిమేక్ కాదా?.. మరి హరీష్ శంకర్ తీసింది ఏంటి?

H-City Projects: ప్రాజెక్టుల పై బల్దియా ఫోకస్.. రూ 1090 కోట్లతో కేబీఆర్ చుట్టూ స్టీల్ ఫ్లైఓవర్లు