Akhanda2 Review: బాలయ్య బాబు ‘అఖండ 2’ ఫుల్ రివ్వూ..
akhanda-2-tandavam(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda2 Review: బాలయ్య బాబు ‘అఖండ 2 తాండవం’తో పూనకాలు తెప్పించారా?.. ఫుల్ రివ్యూ..

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఛటర్జీ తదితరులు.

దర్శకత్వం: బోయపాటి శ్రీను.

సంగీతం: ఎస్. థమన్.

నిర్మాత‌లు: రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా.

విడుదల తేదీ: డిసెంబర్ 12, 2025.

కథా నేపథ్యం

Akhanda2 Review: ‘అఖండ 2’ కథ.. మొదటి భాగం ‘అఖండ’ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి 15 ఏళ్ల తర్వాత జరుగుతుంది. అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని డీఆర్‌డీఓలో సైంటిస్ట్. ఆమె ఎదుర్కొనే సమస్యలు, దేశానికి సంబంధించిన పెద్ద కుట్రల చుట్టూ కథ అల్లుకుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అఖండ (అఘోరా పాత్రలో బాలకృష్ణ) ఏ విధంగా రుద్ర తాండవం చేశాడు అనేది ముఖ్య కథాంశం. ఈసారి బోయపాటి సనాతన ధర్మం, దేశ భద్రత అంశాలను పాన్ ఇండియా స్థాయిలో చూపించడానికి ప్రయత్నించారు. అసలు ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కాలాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 12న విడుదల అయింది. అయినా బాలయ్య బాబు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.. అదే సందటి, అదే అభిమానులు కోలాహలంతో రిలీజ్ అయింది.

Read also-Peddi Update: శుక్రవారం నుంచి ‘పెద్ది’ కొత్త షెడ్యూల్.. ఎక్కడంటే?

కథ ఎలా ఉందంటే..

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కథను అంతర్జాతీయ స్థాయిలో రాసుకున్నారు. అఘోరా పాత్ర‌కు మ‌రింత డోస్ పెంచి బాల‌కృష్ణ‌తో స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేయించారు. స‌నాత‌న ధ‌ర్మం, భార‌తీయుల న‌మ్మ‌కాలు, వేద‌జ్ఞానాల గొప్ప‌త‌నాన్ని అఘోరా పాత్ర‌లోని బాల‌కృష్ణ‌తో చెప్పిస్తూ సినిమాని న‌డిపించారు. అఖండ పాత్రకు బోయ‌పాటి శ్రీను మాస్ ఎలివేష‌న్లు మ‌రింత పెంచారు. ఒక‌ప‌క్క యాక్ష‌న్‌… మ‌రోవైపు ప‌దునైన సంభాష‌ణ‌లతో సినిమాని న‌డిపించిన తీరు మెప్పిస్తుంది. అభిమానుల‌కైతే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్ లో ఉండిపోతారు.

అఖండ రీక్యాప్‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. అక్కడి నుంచి టిబెట్ స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర సంఘ‌ర్ష‌ణ.. దేవుడిపై భార‌తీయుల‌కు ఉండే న‌మ్మ‌కంపైన దెబ్బ కొట్టాల‌ని శ‌త్రుదేశ‌మైన చైనా ప‌న్నాగం ప‌న్న‌డం కోసం ఎలాంటి వ్యూహాల్ని రచించారు అన్నది సినిమాలో కీల‌కం. బాల‌ముర‌ళీకృష్ణ ఇంట్రడక్షన్ స‌న్నివేశాలు, ఎలివేష‌న్లు మాస్ ప్రేక్ష‌కుల‌కు మెప్పించేలా ఉన్నాయి. ఆ త‌ర్వాత కొన్ని సందర్భాల్లో కాస్త సాగ‌దీసినా.. విరామానికి ముందు సినిమా మ‌ళ్లీ పట్టాలు ఎక్కుతుంది. అఘోరా ప్ర‌వేశంతో థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లిపోతుంది. బాల‌య్య తాండ‌వం విరామం త‌ర్వాతే మొద‌లు పెడ‌తాడు. అఘోరా పాత్ర‌లోని రెండు కోణాలూ తెర‌పై క‌నిపించి ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి. తాంత్రికుడైన నేత్ర ఎపిసోడ్ మొద‌లుకొని హ‌నుమాన్, శివుడు ఎపిసోడ్స్ స‌హా త‌ల్లి సెంటిమెంట్‌, దేశ‌భ‌క్తి, హైంద‌వ‌ధ‌ర్మం నేప‌థ్యం వ‌ర‌కూ దాదాపుగా ప్ర‌తీ స‌న్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా త‌ల్లి ద‌గ్గ‌ర స‌న్నివేశాల్లో, స‌ర్జికల్ స్ట్రైక్ అంటూ త‌ల‌ప‌డే స‌న్నివేశాలు, భార‌త‌దేశం గొప్ప‌త‌నం గురించి చెప్పే స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం.

నటీనటులు..

బోయపాటి శ్రీను తనదైన స్టైల్లో బాలకృష్ణ పాత్రలను ఎలివేట్ చేశారు. ప్రతి యాక్షన్ సీన్, అఖండ పాత్ర ఎంట్రీ స్లో మోషన్ షాట్‌లు థియేటర్లో అభిమానులు కోరుకునే విధంగా తీశారు. బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించినా, అఖండ పాత్ర అద్భుతంగా హైలైట్ అయింది. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా అఘోరా ఉగ్రరూపం, శివ తాండవం సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. బాల ముర‌ళీకృష్ణ పాత్ర‌లో స్టైలిష్‌గా క‌నిపించారు. యాక్ష‌న్ ఘ‌ట్టాలతోనూ మెప్పించారు. ముఖ్యంగా విరామానికి ముందు, ప‌తాక స‌న్నివేశాల్లోనూ బాలయ్య న‌ట‌న మ‌రింతగా ప్ర‌భావం చూపిస్తుంది. క‌థానాయిక సంయుక్త (akhanda 2) పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వలేదు. హ‌ర్షాలీ పాత్ర చుట్టూనే క‌థ మొత్తం తిరుగుతుంది. ఆమె ఆ పాత్ర‌లో మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో బ‌లం లేదు. ఉన్నంత‌లో ఆది పోషించిన నేత్ర పాత్రే ప్ర‌భావం చూపించింది. విజి చంద్ర‌శేఖ‌ర్ పోషించిన త‌ల్లి పాత్ర‌ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది.

Read also-Jinn Movie: సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘జిన్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

సాంకేతికంగా..

దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన స్టైల్లో బాలకృష్ణ పాత్రలను ఎలివేట్ చేశారు. ప్రతి యాక్షన్ సీన్, అఖండ పాత్ర ఎంట్రీ స్లో మోషన్ షాట్‌లు థియేటర్లో అభిమానుల కోలాహలానికి కారణమయ్యాయి. సాంకేతిక విభాగాల్లో త‌మ‌న్ సంగీత‌ం అదిరిపోయింది. ఎప్పటిలాగే బీజీఎమ్ తో థమన్ నిరిమాను లేపారు. ఈ సినిమాలో పాట‌లు ఒకెత్తైతే, నేప‌థ్య సంగీతం మ‌రో ఎత్తు. రాంప్ర‌సాద్‌, సంతోష్ దేట‌కే విజువ‌ల్స్ మెప్పిస్తాయి. ముఖ్యంగా కుంభ మేళా స‌న్నివేశాలు, హిమాల‌యాల నేప‌థ్యం సినిమా స్థాయిని మరింత పెంచాయి. మిగిలిన విభాగాలూ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. మాటలు అన్నీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను సిక్వల్ కు త‌గ్గ‌ట్టుగా క‌థ ప‌రిధిని పెంచారు. దానికి కొత్త‌ద‌నం యాడ్ చేస్తే ఇంకాస్త బాగుండేది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ప్రతి సన్నివేశం గ్రాండియర్‌గా కనిపిస్తుంది. పాన్‌ ఇండియా స్థాయికి తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించారు.

బలాలు

  • బాలకృష్ణ నటన
  • ఇంటర్వెల్ సీన్స్
  • తమన్ సంగీతం

బలహీనతలు

  • కథ లేకపోవడం..

రేటింగ్-  2.5 / 5

Just In

01

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?