Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో మోస్ట్ ఎవైటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఫస్ట్ షాట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’.. సినిమాపై హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ట్రేడ్‌మార్క్ మెగా గ్రేస్, ఉర్రూతలూగించే స్క్రీన్ ప్రజెన్స్‌తో వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ రికార్డులను కొల్లగొడుతూ.. ఇప్పటికే 150 మిలియన్ల క్లబ్‌లోకి చేరింది. ఈ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం ఒక హై-ఆక్టేన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించబోతోంది. బాలీవుడ్ సంచలనం జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొన్ని వార్తలు వైరలైన విషయం తెలిసిందే. ఆ వార్తలకు క్లారిటీ ఇస్తూ.. మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు. అదేమిటంటే..
హైదరాబాద్‌లోనూ, ఢిల్లీలోనూ..
ప్రస్తుతం ఇండిగో సమస్యతో ఈ చిత్ర షూటింగ్‌కు కూడా బ్రేక్ పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. శుక్రవారం (డిసెంబర్ 12) నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు, వాటిలో కొన్నింటిని ఢిల్లీలోనూ చిత్రీకరించనున్నారు. జనవరి నెలాఖరు వరకు చిత్రీకరణ కొనసాగుతుంది, అప్పటికి సినిమా మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని భావిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ప్లానింగ్ ప్రకారం, నిర్మాణ పనులన్నీ ఇప్పటి వరకు సజావుగా సాగుతున్నాయని, మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని మేకర్స్ ఇచ్చిన ఈ అప్డేట్‌తో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. చరణ్ పుట్టినరోజుకు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలో దించాలని బుచ్చిబాబుకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
Also Read- Samantha and Raj: సమంత-రాజ్ నిడిమోరుల పెళ్లిపై అరుదైన ఫొటోతో రాజ్ సోదరి షీతల్ పోస్ట్ వైరల్..!
అభిమానుల ఆశలన్నీ ‘పెద్ది’పైనే..
ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆ పాత్ర మరింత బలాన్ని చేకూరుస్తుందని అంటున్నారు. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ పాత్రలు కూడా ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండనున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీగా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమా 27 మార్చి, 2026న గ్రాండ్‌గా పాన్-ఇండియా స్థాయిలో థియేట్రికల్ విడుదలకు రానుంది. ఈ సినిమాపై రామ్ చరణ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారనే విషయం తెలియంది కాదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

