Gellu Srinivas Yadav: మేడ్చల్ జిల్లా శామీర్ పేట్‌లో హై అలర్ట్..!
Gellu Srinivas Yadav (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gellu Srinivas Yadav: మేడ్చల్ జిల్లా శామీర్ పేట్‌లో హై అలర్ట్.. బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్!

Gellu Srinivas Yadav: బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను శుక్రవారం శామీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని మహాత్మ జ్యోతి పూలే తెలంగాణ బిసి రెసిడెన్షియల్ (బాయ్స్) హాస్టల్లో మౌళిక వసతులు కల్పించాలని, నాసిరకమైన భోజనం పెడుతూ, పారిశుధ్య పనులు చేయిస్తున్నారని విద్యార్ధులు గురువారం శామీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. కాగా సామాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, మలువురు బిఆర్ఎస్ నాయకులు హాస్టల్ వద్దకు చేరుకొని నిరసర తెలుపుతుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Also Read: Kissik Talks With Varsha: ఏడాది పాటు బెడ్ రెస్ట్‌లోనే.. మెగాబ్రదరే హెల్ప్ చేశారు- ట్రాన్స్ గర్ల్ బిగ్ బాస్ పింకీ!

గురుకుల పాఠశాలలను..

అనంతరం గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిసి వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను గాలికి వదిలేశారని ఆరోపించారు. గురుకులాల సమస్యలు, నిర్వహణపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహించకపోవడం వల్లే సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గురుకులపై వెంటనే సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి(Madhukar Reddy), విద్యార్థి నాయకులు యశ్వంత్ గుప్తా, ప్రశాంత్ గౌడ్, విశాల్, క్రాంతి, నితీష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Vennam Srikanth Reddy: కాంగ్రెస్ పాలనలో పల్లెలకు అభివృద్ధి: వెన్నం శ్రీకాంత్ రెడ్డి

Just In

01

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం

Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!