Vennam Srikanth Reddy: కాంగ్రెస్ పాలనలో పల్లెలకు అభివృద్ధి
Vennam Srikanth Reddy (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Vennam Srikanth Reddy: కాంగ్రెస్ పాలనలో పల్లెలకు అభివృద్ధి: వెన్నం శ్రీకాంత్ రెడ్డి

Vennam Srikanth Reddy: యువకుడు, సమాజ స్పృహ కలిగిన వ్యక్తి భూక్య ప్రవీణ్(Bhukya Praveen) ను గెలిపించుకొని మేజర్ గ్రామపంచాయతీ గంధంపల్లి గ్రామంలో అభివృద్ధి మెరుగుపరచుకోండని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి(Vennam Srikanth Reddy) సూచించారు. శుక్రవారం గంధంపల్లి మేజర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్య ప్రవీణ్ నాయక్ గెలుపును కాంక్షిస్తూ జరిగిన ప్రచారంలో వెన్నం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) మాట్లాడుతూ… రాష్ట్రంలో అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నాడని, గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గంధంపల్లి మేజర్ గ్రామపంచాయతీని కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

Also Read: Panchayat Elections: మెజార్టీ స్థానాల్లో హస్తం హవా.. పల్లెల్లో జోరుగా సాగిన పోలింగ్!

గాంధీజీ కన్న కలలు నిజం

గత పదేళ్ల కాలంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఆధ్వర్యంలో ఏ పల్లె లో కూడా ఎలాంటి అభివృద్ధి సాధించలేదని, పైగా గ్రామపంచాయతీలను పరిపాలించిన సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చూశామన్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో గాంధీజీ కన్నా కలలు నిజం కావాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉందని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామపంచాయతీలు కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఆ కోణంలోనే గ్రామపంచాయతీలో నిలబడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.

గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు..

గత సీఎంలు చేయలేని పనులను ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నారని, గ్లోబల్ సమ్మిట్(Global Summit) పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి లక్షలాది కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. యువకుడు, గ్రామంలో సమస్యలు తెలిసిన వ్యక్తి భూక్య ప్రవీణ్ నాయక్ ను గెలిపించి తమ గంధంపల్లి(Gandhampally) గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించుకోవలసిన అవసరం ఉందన్నారు.

Also Read: Kalvakuntla Kavitha: నేను సీఎం అవుతా.. నా పవరేంటో చూపిస్తా.. కవిత స్ట్రాంగ్ వార్నింగ్

Just In

01

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం

Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!