Satya Nadella: టెక్ దిగ్గజం Microsoft, భారత ఐటీ పరిశ్రమలోని ప్రముఖ సంస్థలు కాగ్నిజెంట్ ( Cognizant) , ఇన్ఫోసిస్ ( Infosys) , టీసీఎస్ (TCS) , విప్రో (Wipro) తో కలిసి ఏజెంట్‌క్ ఏఐ (Agentic AI) దత్తతను వేగవంతం చేయడానికి కీలక భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. డిసెంబర్ 11న Microsoft CEO సత్య నాదెళ్ల చేసిన ఈ ప్రకటన టెక్ రంగంలో కొత్త ఆసక్తి రేకెత్తించింది.
ఈ ఒప్పందాల ప్రకారం, ప్రతి కంపెనీ 50,000కు పైగా Microsoft Copilot లైసెన్స్‌లు వినియోగించేందుకు సిద్ధమవుతోంది. మొత్తం కలిపి 2 లక్షలకు పైగా Copilot లైసెన్స్‌లు డిప్లాయ్ చేయబడతాయి. ఇది ఎంటర్‌ప్రైజ్ స్థాయి ఏఐ వినియోగంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని మైక్రో సాఫ్ట్ (Microsoft) వెల్లడించింది.
ఈ ప్రకటన నాదెళ్ల ఇండియా టూర్‌లో భాగంగా వచ్చింది. ఒకరోజు ముందు, భారత్‌లో $17.5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు Microsoft ప్రకటించగా, 2029 నాటికి దేశంలో AI, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్లింగ్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.
“ భారతదేశంలో AI, ముఖ్యంగా Agentic AI వినియోగంపై అద్భుతమైన వేగం కనిపిస్తోంది. $17.5 బిలియన్ పెట్టుబడి, ఐటీ దిగ్గజాలతో మా భాగస్వామ్యం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను,” అని నాదెళ్ల అన్నారు. ఈ ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్‌లో మిశ్రమ ప్రతిక్రియలు కనిపించాయి. టీసీఎస్ (TCS) , ఇన్ఫోసిస్ ( Infosys) షేర్లు స్వల్పంగా నష్టాల్లోకి వెళితే, విప్రో (Wipro) 0.49% లాభంతో ట్రేడైంది.
Also Read: Chiranjeevi: గ్లోబల్ సమ్మిట్‌కు పిలవడానికి మంత్రులు వచ్చినప్పుడు నేను ఏ పొజిషన్‌లో ఉన్నానో తెలుసా?
ఈ భాగస్వామ్యాలు సంస్థల ఆపరేషన్స్, ఇన్నోవేషన్ విధానంలో కీలక మార్పులు తెస్తాయని మైక్రో సాఫ్ట్ ( Microsoft ) పేర్కొంది. Copilot వినియోగం ఉత్పాదకతను పెంచటమే కాకుండా, ఏఐ ఆధారిత పరిష్కారాలను విభిన్న రంగాల్లో మరింత విస్తరించనుందని వెల్లడించింది.
“ కాగ్నిజెంట్ (Cognizant) , ఇన్ఫోసిస్ ( Infosys) , టీసీఎస్ (TCS) , విప్రో ( Wipro) ఏఐని వాడటం మాత్రమే కాదు, దాన్ని ప్రపంచానికి ఎలా ఉపయోగించాలో దిశా నిర్ధేశం చేస్తున్నాయి. ఇవన్నీ ట్రయల్స్ నుంచి ముందుకు వచ్చి, AIని వాటి రోజువారీ పనులలోనే భాగం చేస్తున్నాయి. స్పీడ్, స్కేల్, ఇంపాక్ట్—all at once—అంటే ఒకేసారి ఈ మూడు కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి” అని Microsoft India & South Asia అధ్యక్షుడు పునీత్ చంద్రోక్ చెప్పారు.
ఈ భాగస్వామ్యం భారత ఐటీ రంగాన్ని గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దడంలో మరో కీలక మైలురాయిగా పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

