Hyderabad Crime: వీడిన రెయిన్ బజార్ మర్డర్ మిస్టరీ
Hyderabad Crime ( image CRedit: swetcha reporter)
క్రైమ్, హైదరాబాద్

Hyderabad Crime: రెయిన్ బజార్ హత్యకేసులో సంచలన ట్విస్ట్.. 12 మందితో మీటింగ్ పెట్టి హత్యకు ప్లాన్!

Hyderabad Crime: సంచలనం సృష్టించిన రెయిన్ బజార్​మర్డర్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. దక్షిణ మండలం డీసీపీ కిరణ్​ఖరే, అదనపు డీసీపీ మహ్మద్​ మాజిద్, మీర్‌చౌక్​ ఏసీపీ శ్యాం సుందర్‌తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. యాఖుత్‌పురా నివాసి షేక్​జునైద్ బిన్ మహ్మద్ (35) స్థానికంగా బియ్యం దుకాణంలో పనిచేస్తూ, కమీషన్​తీసుకుంటూ ఇండ్లు కొనిపించటం, అమ్మించటం చేసేవాడు.

జునైద్‌ను హత్య చేయాలి

రెయిన్​బజార్​పోలీస్​స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదై ఉన్న ఒమర్ బిన్​అల్‌జాబ్రీ (35), సస్పెక్ట్ షీటర్‌గా ఉన్న అలీ బిన్​హంజా అల్ జాబ్రీ (31) సోదరులు కాగా, వీరు జునైద్‌కు బంధువులు కూడా. ఒమర్, అలీ బిన్‌లు స్థానికంగా ఎవరు ఇల్లు అమ్మినా, కొన్నా బెదిరించి లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేసేవారు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామంటూ భయపెట్టేవారు. వీరి ఆగడాలకు జునైద్ అడ్డు పడేవాడు. అప్పటికే వీరి కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఒమర్, అలీ కలిసి జునైద్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. జునైద్‌తో పాతకక్షలు ఉన్న సయ్యద్​రహీం ఘోరీ షాజిబ్​(30), మలిక్​బిన్​జావీద్ అల్​జాబ్రీ (32), కుల్సుంలను తమ కుట్రలో భాగస్వాములుగా చేసుకున్నారు.

Also Read: Hyderabad Crime News: నగరంలో తీవ్ర విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!

విచక్షణారహితంగా దాడి హతం

ఈ పరిస్థితుల్లోనే జునైద్​స్నేహితుడు ఫారూఖ్​ఇల్లు కొనుక్కోగా, అతని వద్దకు వెళ్లిన ఒమర్, అలీ బిన్‌లు డబ్బు డిమాండ్​చేశారు. విషయం తెలిసిన జునైద్​జోక్యం చేసుకుని హెచ్చరించాడు. ఈ గొడవ తరువాత ఒమర్, అలీ.. బిన్ హంజా అలీ జాబ్రీ, ఫైసల్​బిన్​హబీబ్ మహ్మద్, మక్సూద్​అలీ, సయ్యద్ అస్ఘర్, మహ్మద్​తాహెర్, అజర్, జుబైర్, రియాన్‌లను గ్యాంగులో చేర్చుకున్నారు. 12 మంది కలిసి ఒమర్ బిన్ ఇంట్లో సమావేశమై జునైద్‌ను హత్య చేయటానికి పథకం రూపొందించారు. దాని ప్రకారం ఈనెల 3న జునైద్ చోటాపూల్ ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకుని అంతా కలిసి అక్కడికి వెళ్లారు.

అలీ‌ కలిసి కత్తులతో విచక్షణారహితంగా

మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ హబీబ్, రహీం, అస్ఘర్‌లు అతన్ని కదలకుండా పట్టుకోగా ఒమర్, అలీ‌ కలిసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలైన జునైద్ అక్కడికక్కడే మరణించగా నిందితులంతా కలిసి పారిపోయారు. రెయిన్​బజార్​సీఐ నేతాజీ, టాస్క్‌ఫోర్స్ సీఐ ఆదిరెడ్డి సహా ఇతర అధికారులు విచారణ చేపట్టి, పక్కాగా ఆధారాలు సేకరించారు. నిందితుల్లో ఒమర్, అలీ, ఫైజల్, మక్సూద్, అస్ఘర్, తాహెర్‌లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఆరుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్టు డీసీపీ తెలిపారు.

Also Read: Hyderabad Crime: ట్రాన్స్ జెండర్ కోసం.. ఫ్రెండ్స్ మధ్య గొడవ.. కత్తులతో పొడిచి యువకుడి హత్య

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క