Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు రౌడీ షీటర్ ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ట్రాన్స్ జెండర్ ను అత్యాచారం చేసి డబ్బు చెల్లించే విషయంలో జరిగిన గొడవ వల్లే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న జగద్గిరిగుట్టలోని నిర్మానుష్య ప్రాంతానికి ఓ ట్రాన్స్ జెండర్ ను తీసుకెళ్లి రోషన్ సింగ్ (25) మరో ఆరుగురు స్నేహితులు అత్యాచారం చేశారు. డబ్బు చెల్లింపు విషయంలో గొడవ జరగడంతో వీరిపై బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
అయితే ట్రాన్స్ జెండర్ కేసు పెట్టేలా బాలశౌ రెడ్డి ఉసిగొల్పాడని రోషన్ సింగ్ భావించాడు. దీంతో అతడ్ని ఎలాగైనా చెంపేస్తానని స్నేహితుల ముందు శపథం చేశాడు. అయితే ఈ విషయం బాలశౌ రెడ్డి చెవిన పడింది. వాడు తనను చంపేదేంటని.. తానే రోషన్ సింగ్ ను హత్య చేయాలని బాలశౌ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మద్యం తాగి జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్దకు రోషన్ సింగ్ వచ్చాడు. దీంతో బాలశౌ రెడ్డి తన స్నేహితులు ఆదిల్, మహమ్మద్ తో కలిసి రోషన్ సింగ్ తో వాగ్వాదానికి దిగాడు.
Also Read: AUS vs IND 4th T20I: కాసేపట్లో భారత్-ఆసీస్ నాల్గో టీ20.. ఇరు జట్లలో కీలక మార్పులు.. ఎవరు గెలుస్తారంటే?
తనను చంపేస్తానని బెదిరించావంట కదా? అని రోషన్ సింగ్ ను బాలాశౌ రెడ్డి ప్రశ్నించాడు. ఈ విషయమై వాగ్వాదం మరింత పెద్దది కావడంతో రోషన్ చేతులను మహమ్మద్ వెనుక నుండి బలంగా పట్టుకున్నాడు. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో రోషన్ ను బాలశౌ రెడ్డి పలుమార్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి స్నేహితులతో కలిసి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన రోషన్ సింగ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రోషన్ సింగ్ తో పాటు నిందితులు బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్ లపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
