GHMC: సర్కిల్స్, జోన్లు, ప్రధాన కార్యాలయంలో స్పెషల్ కౌంటర్లు
GHMC ( image credit: swetcha reporer)
హైదరాబాద్

GHMC: సర్కిల్స్, జోన్లు, ప్రధాన కార్యాలయంలో స్పెషల్ కౌంటర్లు.. మొత్తం 57 సర్కిళ్లలో ఏర్పాటు!

GHMC: జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసి, చేపట్టిన మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్‌పై అధికారులు అభ్యంతరాలు, సలహాలను స్వీకరించడం మొదలు పెట్టారు. స్వీకరణ కోసం 30 సర్కిళ్లతో పాటు 6 జోనల్ ఆఫీసులతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా స్పెషల్‌గా కౌంటర్లను ఏర్పాటు చేశారు. నుంచి 7 రోజుల పాటు అన్ని కౌంటర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వార్డుల డీలిమిటేషన్, సరిహద్దులపై వ్యక్తులు, సంస్థల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తున్నారు. కేవలం మ్యానువల్‌గా, లిఖితపూర్వకంగా స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ ఫార్మెట్‌ను రూపొందించారు.

300 వార్డులకు స్వీకరిస్తున్న అభ్యంతరాలు

వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో 2016లో 150 వార్డుల డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇదే తరహాలో అభ్యంతరాలు, సలహాలను స్వీకరించగా, 650 అభ్యంతరాలు, సలహాలు స్వీకరించినట్లు సమాచారం. ఇప్పుడు 300 వార్డులకు స్వీకరిస్తున్న అభ్యంతరాలు, సలహాలు రెండింతలు అంటే దాదాపు వెయ్యికి పైగా లేదా 1,300 వరకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అయితే, 7 రోజుల పాటు స్వీకరించి వెంటనే వాటిని పరిష్కరించాలని కమిషనర్ కర్ణన్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక్క జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌంటర్‌కు అభ్యంతరాల స్వీకరణ తొలి రోజైన బుధవారం నాలుగు అభ్యంతరాలు స్వీకరించినట్లు తెలిసింది.

Also Read: GHMC: బల్దియా చరిత్రలో తొలిసారి 13 వేల కోట్ల పైచిలుకు బడ్జెట్.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..!

తొలి రోజే 40 అభ్యంతరాలు, సలహాల స్వీకరణ

వార్డుల డీలిమిటేషన్ డ్రాఫ్ట్‌కు సంబంధించి తొలి రోజైన  ఒక్క రోజే 40 అభ్యంతరాలను, సలహాలను స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పాత పరిధిలోని 30 సర్కిళ్లు, 6 జోన్లతో పాటు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌తో పాటు ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలను ప్రస్తుతం సర్కిల్‌గా పరిగణించిన మరో 27 సర్కిళ్లతో కలిపి ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని మొత్తం 57 సర్కిళ్లలో 40 అభ్యంతరాలు, సలహాలను స్వీకరించినట్లు వెల్లడించారు.

Also Read: GHMC: బల్దియా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క