IndiGo Crisis: మూడు నగరాల్లో 220 విమానాలు రద్దు
IndiGo ( Image Source: Canva )
జాతీయం

IndiGo Crisis: ఇండిగో సంక్షోభం.. నేడు ఢిల్లీ, ముంబై, బెంగళూరులో 220 విమానాలు రద్దులు

IndiGo Crisis: ఇండిగో ఎదుర్కొంటున్న కార్యకలాపాల అంతరాయాలు మరింత తీవ్రమవుతున్నాయి. పలు మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో నేడు దాదాపు 220 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విమాన రవాణా మార్కెట్‌లో సామర్థ్య లోటు తలెత్తకుండానే, స్పైస్‌జెట్ ప్రస్తుత వింటర్ షెడ్యూల్‌లో రోజుకు అదనంగా 100 ఫ్లైట్లు జోడించేందుకు నిర్ణయించింది.

ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయం ఎనిమిదో రోజుకూ చేరింది. భారీ రద్దులు, ఆలస్యాలు, కార్యకలాప లోపాలను ఎదుర్కొన్న airline, 8 డిసెంబరు నాటికి తమ నెట్‌వర్క్ పూర్తిగా పునరుద్ధరించామని, 90% ఆన్-టైమ్ పనితీరు సాధించామని ప్రకటించింది. అయితే, దీనికి విరుద్ధంగా బెంగళూరు, ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాలు మంగళవారం 200కి పైగా ఫ్లైట్‌ అంతరాయాలను నమోదు చేశాయి.

Also Read: Bhatti Vikramarka: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈ పరిస్థితుల్లో DGCA డీజీసీఏ మళ్లీ ఇండిగోకు నోటీసు పంపించింది. ప్లాన్ చేసినా షెడ్యూల్‌ని అమలు చేయలేకపోయిందన్న కారణంతో ఈ నోటీసు ఇచ్చి, ఇక నుంచి ఇండిగో ఫ్లైట్ ఆపరేషన్స్‌ను మరో 5% తగ్గించాలని ఆదేశించింది. ఇదే కాక, గత వారం భారీగా జరిగిన ఫ్లైట్ రద్దులపై కూడా షోకాజ్ నోటీసు ఇచ్చి, సోమవారం సాయంత్రం 6 గంటలలోపు సమాధానం ఇవ్వాలని చెప్పింది. కానీ, ఇండిగో మరికొంచెం టైమ్ కావాలని కోరుతూ, తమ ఆపరేషన్స్ చాలా పెద్దవి, క్లిష్టమైనవి కావడం వల్ల అసలు సమస్య ఏంటో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని చెప్పిందని సమాచారం.

Also Read: Srilatha Shobhan Reddy: సీఎం దృష్టికి ఓయూలోని బస్తీల సమస్యలు.. రూ. 20 కోట్లు కేటాయించాలని డిప్యూటీ మేయర్ దంపతుల వినతి

క్రూ రోస్టరింగ్‌ సమస్యలే కారణం

రాజ్యసభలో మాట్లాడిన పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు, ఇండిగోకి వచ్చిన ఈ సమస్యలకు Aircraft Maintenance and Scheduling System (AMSS)కి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య airline లోపలే.. క్రూ షిఫ్ట్‌లు ఎలా వేయాలి, ఏ ఫ్లైట్‌కి ఎవర్ని ఎలా ప్లాన్ చేయాలన్న క్రూ రోస్టరింగ్‌, ఆపరేషన్స్ ప్లానింగ్‌లోనే ఉందన్నారు.

Also Read: Akhanda 2 Thaandavam: బాలయ్య అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి..

అలాగే, ఫ్లైట్‌లు లేట్ అవ్వడం, రద్దు అవ్వడం వల్ల ప్రయాణికులు పడే ఇబ్బందులను తగ్గించడానికి కఠినమైన Civil Aviation Requirements (CARs) అనే నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క