Suryapet News: బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడులు
Suryapet News (imagecredit:twitter)
నల్గొండ

Suryapet News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడులు ఓ కార్యకర్త మృతి!

Suryapet News: సూర్యాపేట జిల్లాలో ఎన్నికల వేల కాంగ్రెస్(Congress) బీఆర్ఎస్(BRS) పరస్పర దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట(Surayapeta) జిల్లా లింగంపల్లి(Lingam Pally) గ్రామంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బిఆర్ఎస్(BRS) పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చిల్కి చిలికి గాలివానగా మారి రాళ్ల దాడి చేసుకునేంతగా పెరిగిపోయింది. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో టిఆర్ఎస్ పార్టీకి చెందిన మల్లయ్య అనే వ్యక్తి రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. మల్లయ్యను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Also Read: Sarpanch Elections 2025: చిచ్చుపెట్టిన సర్పంచ్ ఎన్నికలు.. బరిలో అత్తా, కోడలు.. తికమకలో ఓటర్లు!

గ్రామంలో పోలీసుల మోహరింపు, పికెటింగ్ 

సూర్యాపేట జిల్లా లింగంపల్లి గ్రామంలో ఇరువు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్న ఘటనలో మల్లయ్య(Mallaiah) అనే టిఆర్ఎస్ కార్యకర్త మృతి చెందడంతో జిల్లా ఎస్పీ నరసింహ(SP Narasimha) లింగంపల్లి గ్రామంలో భారీగా పోలీసులు మోహరింపజేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పికెటింగ్ చేపడుతున్నారు. గ్రామంలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు(police) గస్తీ కాస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు.

Also Read: TG Global Summit: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లోని పూర్తి అంశాలు.. ప్రణాలికలు ఇవే..!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క