India vs South Africa: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో (India vs South Africa) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమైన ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లో 59 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యా సహకారంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 స్కోరు సాధించింది. దీంతో, దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 176 పరుగులుగా ఖరారైంది.
సఫారీ బౌలర్లపై విరుచుకుపడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టాడు. మిగతా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 4, అభిషేక్ శర్మ 17, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ శర్మ 26, అక్షర్ 23, శివమ్ దూబే 11, జితేష్ శర్మ 10 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, సిప్‌మ్లా 2, ఫెర్రీరా 1 చొప్పున వికెట్లు తీశారు.
టాపార్డర్ ఘోరంగా విఫలం
కటక్ టీ20 మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేేకపోయారు. టీమ్ స్కోరు 5 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 17 పరుగుల వద్ద కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెవీలియన్ చేరాడు. ఆదుకుంటాడని భావించిన డాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా ఆ కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. దీంతో, 48 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో, జట్టు కనీసం 150 స్కోర్ అయినా అందుకుంటుందా లేదా అనే సందేహం కలిగింది. అయితే, ఆ సమయంలో హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
Read Also- Panchayat Elections: ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు.. 112 సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక నిఘా!
తుది జట్లు ఇవే..
భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు చోటుదక్కలేదు.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డానోవన్ ఫెరీరా, మార్కో యన్సెన్, కేశవ్ మహారాజ్, లుథో సిపామ్లా, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే.

