Meta Phoenix Launch: మెటా తాజాగా భారత మార్కెట్‌లో రే-బాన్ మెటా జెన్ 2 స్మార్ట్ గ్లాసెస్‌ను రిలీజ్ చేసి మంచి క్రేజ్ క్రియేట్ చేసింది. ఇదే ఊపులో కంపెనీ వచ్చే ఏడాదిలోనే తన ప్రెస్టీజియస్ మిక్స్‌డ్ రియాలిటీ ప్రాజెక్ట్. కోడ్‌నేమ్ Phoenix ను మార్కెట్‌లోకి తెస్తుందనే టాక్ వినిపిస్తోంది. కానీ తాజా రిపోర్ట్ మాత్రం షాక్‌కి గురిచేసింది. మిక్స్‌డ్ రియాలిటీ రంగంలో పోటీ రోజురోజుకీ పెరుగుతుండటంతో, మెటా ఈ ప్రాజెక్ట్ లాంచ్‌ను 2027కి వాయిదా వేసినట్లు సమాచారం. కంపెనీ ఇంకా ప్రొడక్ట్‌పై ఫైన్‌ట్యూనింగ్ చేయాల్సి ఉండటమే దీనికి కారణమని అంటున్నారు.
ఫీనిక్స్‌లో MR గ్లాసెస్ లాంచ్ ఎందుకు వాయిదా పడింది?
బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం, రియాలిటీ ల్యాబ్స్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ మహేర్ సాబా పంపిన ఇంటర్నల్ మెమోలో, ఫీనిక్స్‌గా గుర్తింపు ఉన్న ఈ మిక్స్‌డ్ రియాలిటీ గ్లాసెస్‌ను 2027 మొదటి అర్ధభాగంలో విడుదల చేయాలని కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు ప్లాన్ 2026 రెండో అర్ధభాగం అయినా, యూజర్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదనే కారణంతో టైమ్‌లైన్ పూర్తిగా మార్చేశారు.
అదే మెమోలో మెటావర్స్ టీమ్‌కు చెందిన గాబ్రియెల్ ఔల్, ర్యాన్ కెయిర్న్స్ కూడా ఈ డిలే కంపెనీకి “ డిజైన్, కోర్ UXను మరింత పర్ఫెక్ట్‌గా చేసుకునే అవకాశం ఇస్తుంది” అని తెలిపారు. “ తొందరపడి పాడైన ప్రొడక్ట్ ఇవ్వలేం, పూర్తిగా రిఫైన్ అయ్యే వరకు వేచిచూడటం మంచిదే ” అని వారు స్పష్టం చేశారు.
ఫీనిక్స్‌లో ఏముంటుంది?
ఇప్పటి వరకు వచ్చిన లీక్స్ ప్రకారం, ఫీనిక్స్ ఒక గాగుల్ స్టైల్ హెడ్‌సెట్‌గా ఉండి, ఇది ఒక పక్-షేప్ ఎక్స్‌టర్నల్ మాడ్యూల్‌తో కనెక్ట్ అయి పనిచేస్తుందని సమాచారం. ఈ విధమైన డిజైన్ తీసుకోవడానికి కారణం. యూజర్‌కి తక్కువ బరువుతో, ఎక్కువ కంఫర్ట్‌తో, థర్మల్ మెయిన్టెనెన్స్ బాగా ఉండేలా రూపొందించడం. సరిగ్గా యాపిల్ విజన్ ప్రొ లాంటి MR హెడ్‌సెట్లలో కనిపించే వేడి సమస్యలను తగ్గించడానికే ఈ సిస్టమ్. ఇంకా, ఈ డివైస్ మెటా క్వెస్ట్ సిరీస్‌లో ఉపయోగించే హారిజన్ OS మీదే రన్ అవుతుందని తెలిసిన సమాచారం. మొత్తంగా, ఫీనిక్స్ మెటా నుంచి వచ్చే తదుపరి పెద్ద MR ప్రొడక్ట్ అయినా, యూజర్లు దాన్ని చూడాలంటే మరో రెండేళ్లు వేచి చూడాల్సిందే.

