GHMC: బల్దియా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: బల్దియా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

GHMC: గ్రేటర్ బయట, ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లోపలనున్న 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసుకుని విస్తరించిన జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో మున్సిపల్ వార్డు సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో సర్కారు వార్డుల పునర్విభజనకు సంబంధించి పలు కీలకమైన సూచనలు జారీ చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) మొత్తం విలీనం నేపథ్యంలో వార్డుల సంఖ్ 300 లకు ఫిక్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో మొత్తం 300 ఎన్నికైన వార్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా , అర్బన్ డెవలప్ మెంట్ శాఖ (ఎంఏయూడీ) జారీ చేసిన జీవో నెం. 266 ప్రకారం, జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డ్ రీఆర్గనైజేషన్ ఫ్రేమ్‌వర్క్ అధ్యయన నివేదికను పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ అధ్యయనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో చేపట్టినట్లు సర్కారు పేర్కొంది. జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలో, విస్తరించిన నగర పరిమితులు, జనాభా గణాంకాలు, సేవల డెలివరీ అవసరాల ప్రకారం 300 వార్డులు అవసరమని వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టం, 1955 నిబంధనల ప్రకారం కొత్త వార్డుల సంఖ్యను ఖరారు చేసినట్లు సర్కారు పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఎక్స్‌ట్రార్డినరీ గెజిట్ లో ప్రచురించాలని ఆదేశించింది. ముద్రణ శాఖకు 500 ప్రతులను ప్రభుత్వానికి అందించాలని కూడా నోటిఫికేషన్ లో సర్కారు సూచించింది. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన భవిష్యత్తులో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది.

పునర్విభజన ఇలా…

పట్టణ స్థానిక సంస్థల విలీనానికి ముందున్న జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పునర్విభజను కూడా చేపట్టిన అధికారులు విలీన చేసిన స్థానిక సంస్థను కలుపుకుని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లో మొత్తం 300 వార్డులుగా పునర్విభజించనున్నారు . ఇందుకు సంబంధించి అధికారులు శనివారం మున్సిపల్ వార్డుల పునర్విభజన ముసాయిదాను సైతం జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రతి 40 వేల జనాభాతో కొత్తగా ఏర్పడిన 150 మున్సిపల్ వార్డులకు ఆ వార్డులోని చారిత్రాత్మక కట్టడాలు, పేర్లు, ల్యాండ్ మార్క్ లను బట్టి వార్డులకు నామకరణం చేశారు. 40 వేల జనాభాను ప్రామాణికంగా తీసుకుని పది శాతం తేడాతో ఈ వార్డులను పునర్విభజించినట్లు సమాచారం. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ జనాభా కోటి 2 లక్షల వరకుండగా, జీహెచ్ఎంసీ అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ప్రస్తుత జనాభా అంచనాలు తెప్పించుకోగా, విలీన స్థానిక సంస్థలను కలుపుకుని మొత్తం జనాభా సుమారు కోటి 30 లక్షల జనాభా గణాంకాలను సేకరించి వార్డులను పునర్విభజించారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ యాక్టు 1959 ప్రకారం, ఇటీవలే చేసిన సవరణలతో వారం రోజుల పాటు పునర్విభజనపై ప్రజలు, వ్యక్తులు, సంస్థల నుంచి అధికారులు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వీటిని డిస్పోజ్ చేసిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత సర్కిళ్లు, జోన్లను ఏర్పాటు చేయనున్నారు. విలీనానికి ముందు జీహెచ్ఎంసీలో ఉన్న ఆరు జోన్లను పది జోన్లుగా, 30 సర్కిళ్లను 50 సర్కిళ్లుగా ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 300 మున్సిపల్ వార్డులను పునర్విభజించినా, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కసరత్తు చేయనున్న తెలిసింది.

Also Read: TG Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో జరిగే నేటి కార్యక్రమాలు ఇవే..!

సిటీలో పెరిగిన వార్డులు

ముషీరాబాద్ సర్కిల్ లో కొత్తగా 3 వార్డులు, కాప్రా సర్కిల్ లో 6, అంబర్ పేట సర్కిల్ లో 5, మెహిదీపట్నం సర్కిల్ లో5, శేరిలింగంపల్లి సర్కిల్ లో 4, జూబ్లీహిల్స్ సర్కిల్ లొ 4, సికిందరాబాద్ సర్కిల్ లో 2, కుత్బుల్లాపూర్ సర్కిల్ లో 4, ఉప్పల్ లో 4, హయత్ నగర్ సర్కిల్ లో 1 కొత్తగా ఏర్పాటు కాగా, ఈ మొత్తం పది సర్కిళ్లలో కలిపి మొత్తం 47 వార్డులుండగా, వీటికి అదనంగా 38 వార్డులను ఏర్పాటు చేరాయి. దీంతో పది సర్కిళ్లలో పాత వార్డులు 47 ఉండగా, కొత్తగా ఏర్పడిన 38 వార్డులతో కలిపి పది సర్కిళ్ల లో వార్డుల సంఖ్య 85 కి పెరగనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో 150 వార్డులుండగా, ప్రతి సర్కిల్ లో దాదాపు నాలుగు వార్డులు పెరగనున్నాయి. మొత్తం 30 సర్కిళ్లలోని 150 వార్డుల సంఖ్య 260 నుంచి 270 వరకు పెరగనున్నట్లు, ఇక జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లో కార్పొరేషన్లను రెండు వార్డులుగా,అంటే మొత్తం 14 వార్డులుగా, అలాగే 20 మున్సిపాల్టీలను దాదాపు ఒక్కో వార్డుగా ఏర్పాటు చేయాలని భావించగా, పెద్ద అంబర్ పేటలో అదనంగా రెండు వార్డులను కొత్తగా ఏర్పాటు చేసినట్లు, మొత్తం కలిపి సుమారు 300 వార్డులుగా సంఖ్యను ఫిక్స్ చేశారు.

వంద వార్డుల నుంచి 300 వార్డులకు

ప్రస్తుత జీహెచ్ఎంసీ 2007 కు ముందుకు వంద డివిజన్లతో ఏడు సర్కిళ్లతో కేవలం 72 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. 2007 ఏప్రిల్ లో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ లోకి శివారులోని 12 మున్సిపాల్టీలను విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం గ్రేటర్ గా మార్చింది. అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు జీహెచ్ఎంసీ 625 కిలోమీటర్ల పరిధితో 150 వార్డులు, ఆరు జోన్లు, 30 సర్కిళ్లుగా సుమారు కోటి 2 లక్షల జనాభాతొ కొనసాగింది. ఇటీవలే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయటంతో జీహెచ్ఎంసీ పరిధి సుమారు 1900 కిలోమీటర్లకు విస్తరించింది. ఈ విలీనంతో ఇపుడు దేశంలోనే జీహెచ్ఎంసీ అతి పెద్ద సిటీగా రూపాంతరం చెందింది.

Aarogyasri News: రాష్ట్రంలో రెండేళ్లలో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు.. మెరుగైన వైద్యంతో పాటు..!

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం