Aarogyasri News: ప్రజా ప్రభుత్వం 163 రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఫలితంగా ఆరోగ్య శ్రీ కింద అందే చికిత్సల సంఖ్య 1,835కి పెరిగింది. లక్షలాది మందికి ప్రయోజనం కలిగింది. అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 1,375 వైద్య చికిత్సల ధరలను సుమారు 22 నుంచి 25 శాతం వరకూ పెంచింది. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్ల సంఖ్యను క్రమంగా ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్నది. ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
28 పారామెడికల్ కాలేజీలు
రాష్ట్రంలో కొత్తగా 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. ఫలితంగా రాష్ట్రంలో వీటి సంఖ్య 12 నుంచి 40కి పెరిగింది. కొత్తగా ప్రారంభించిన ఒక్కో కాలేజీలో 60 సీట్ల చొప్పున 1,680 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా తెలంగాణలో ప్రస్తుతం 3,172 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులున్నా వైద్యులు లేక గతంలో అవి అలంకారప్రాయంగా ఉండేవి. ఆ స్థితిని మర్చి ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టింది. మొత్తంగా రెండేళ్ల కాలంలోనే వైద్యారోగ్యశాఖలో 9 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసింది. మరో 7వేల పైచిలుకు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. అలాగే, రాష్ట్రంలో కొత్తగా 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగ
విద్యార్థుల కోసం..
ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల సౌకర్యార్దం కొత్త హాస్టల్ బిల్డింగ్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి నిర్మాణానికి రూ.204.85 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 15 శాతం పెంచింది. దేశంలోనే అత్యధిక స్టైఫండ్స్ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలి ఐదు స్థానాల్లో ఉన్నది. తెలంగాణలో కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్ల చొప్పున అదనంగా 960 తెలంగాణ బిడ్డలకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో నర్సింగ్ కాలేజీల సంఖ్య 21 నుంచి 37కు పెరిగింది. సీట్ల సంఖ్య 1,400 నుంచి 2,360కి చేరింది. నర్సులకు దేశ, విదేశాల్లో ఉద్యోగవకాశాలు కల్పించే విధంగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సహకారంతో ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ భాషలను నర్సింగ్ విద్యార్థులకు నేర్పిస్తున్నది.
Also Read: Datta Jayanti: సంగారెడ్డి జిల్లాలో నేత్రపర్వంగా… ఆదిదంపతుల కళ్యాణం
అన్ని రకాల వైద్య సేవలు
ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్‌ను ప్రజా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించేలా క్లినిక్‌లను రూపొందించింది. సుమారు 50 లక్షల మంది పేషెంట్లకు ఈ క్లినిక్‌ల ద్వారా వైద్యం అందుతున్నది. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం వ్యాధిగ్రస్తులు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరం లేకుండా, జిల్లాల్లోనే కీమో థెరపి చికిత్స అందించే ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు ప్రారంభించింది.
102 డయాలసిస్ సెంటర్లు
డయాలసిస్ చేయించుకోవాలంటే వాస్క్యులర్ యాక్సెస్ పాయింట్ తప్పనిసరి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లోని ఎంజీఎం, ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మహబూబ్‌నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్‌లో వాస్క్యులర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. డయాలసిస్ చేయించుకునే వారికి మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించడానికి కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో గ్రామానికి సమీపంలోనే డయాలసిస్ సేవలు అందడంతో పాటు వెయిటింగ్ టైమ్ కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో 102 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున, మరో 50 రాబోయే 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా ప్రణాళిక రచిస్తున్నది. అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.వెయ్యి కోట్లతో రెండు సంవత్సరాల్లో ట్రామా కేర్ సెంటర్లను అందుబాటు
ప్రతి జిల్లాలో సెంట్రల్ మెడిసినల్ స్టోర్
హైదరాబాద్‌లోని గాంధీ, పెట్లబుర్జు హాస్పిటల్స్‌లో ఐవీఎఫ్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వరంగల్ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. అలాే, రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రతి జిల్లాలో సెంట్రల్ మెడిసినల్ స్టోర్ (సీఎంఎస్) ఏర్పాటు చేశారు. 22 జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ మహా నగరంలో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ (టిమ్స్) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఆల్వాల్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో సైన్సెస్‌గా, సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ సైన్సెస్‌గా, కొత్తపేట్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్యాస్ట్రో సైన్సెస్‌గా సేవలు అందించనున్నాయి. సనత్‌నగర్ టిమ్స్‌లో అన్నిరకాల ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ టిమ్స్ పనుల తీరుపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ క్రమానుగతంగా సమీక్షిస్తున్నారు. రూ.2 వేల కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోషామహల్‌ల
Also Read: TG Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో జరిగే నేటి కార్యక్రమాలు ఇవే..!

