Oppo Reno 15: త్వరలో లాంచ్ కానున్న Oppo Reno 15
Oppo Reno ( Image Source: Twitter)
Technology News

Oppo Reno 15: త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న Oppo Reno 15.. ఫీచర్లు ఇవే!

Oppo Reno 15: చైనాలో అధికారికంగా డెబ్యూ చేసిన తర్వాత Oppo Reno 15 సిరీస్ ఇప్పుడు గ్లోబల్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. కెమెరా ఫీచర్లు, క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టూల్స్‌తో ఈ సిరీస్, ఓప్పో తన ఇమేజింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ ఇంకా ప్రకటించకపోయినా, పరిశ్రమ వర్గాలు Reno 15 సిరీస్ వచ్చే కొన్ని వారాల్లో మార్కెట్‌లోకి ముందే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.

చైనాలో Reno 15 Pro ధర CNY 3,699 అంటే ఇండియన్ కరెన్సీ లో రూ.46,000. అయితే, భారత మార్కెట్‌కు వచ్చే స్టాండర్డ్ Reno 15 మోడల్ దీనికంటే తక్కువ ధరలో లభించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. వేరియంట్ల ఆధారంగా ఈ ఫోన్‌ను రూ.32,000 నుంచి రూ.38,000 మధ్య ఓప్పో అందించే అవకాశం ఉంది. అధికారిక ధర మాత్రం లాంచ్ ఈవెంట్ నాటికే వెల్లడవుతుంది.

Also Read: Illegal Registrations: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. రిజిస్ట్రేషన్ చేయాలంటే చేతులు తడపాల్సిందే.. లేదంటే ముప్పు తిప్పలు

ఫీచర్ల పరంగా, Reno 15 సిరీస్, మెరుగైన కెమెరా పనితీరు, థర్మల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టనుందని తెలుస్తోంది. గ్లోబల్ వెర్షన్‌లలో ఉండే ColorOS 16, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్స్, గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వంటి హెవీ యూజ్ కోసం ఆప్టిమైజేషన్‌‍లు భారత వేరియంట్‌లో కూడా ఉండే అవకాశముంది. హై-రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Also Read: Thimmapur Election Scam: స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు.. ఊరు లేదు.. జనాలు లేరు.. అయినా పంచాయతీ నోటిఫికేషన్..!

Pro మోడల్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, స్టాండర్డ్ Reno 15లో కూడా తక్కువ వెలుతురు పరిస్థితుల్లో మంచి ఫలితాలు ఇచ్చే ప్రైమరీ కెమెరా, వైడ్-యాంగిల్, పోర్ట్రెట్ లెన్స్‌లు, AI ఆధారిత లైవ్ స్ట్రీమింగ్ ఎంహాన్స్మెంట్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, అదనంగా సుమారు 5,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పనితీరును అందించే AI ఆప్టిమైజేషన్లు అందించబడే అవకాశముంది.

Also Read: Mandhana-Palash: రూమర్లపై ఇంత తేలికగా స్పందించడం కష్టంగా ఉంది.. మందాన ప్రకటనకు పలాష్ ముచ్చల్ కౌంటర్ పోస్ట్

డిజైన్ పరంగా Reno 15 సిరీస్ ఫ్లాట్-ఫ్రేమ్ స్టైల్‌తో ప్రీమియమ్ లుక్‌ను అందించవచ్చు. మెరుగైన డ్యూరబిలిటీ రేటింగ్స్, పెరిగిన డిస్ప్లే బ్రైట్‌నెస్ కూడా ఈ సిరీస్ ప్రత్యేకతలు కావచ్చు. వ్లాగింగ్, ఫోటోగ్రఫీ, గేమింగ్ వంటి క్రియేటర్-సెంట్రిక్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత యువ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని Reno 15‌ను ఓప్పో ఒక శక్తివంతమైన ఆప్షన్‌గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య