Viral Video: బోర్ కొడుతోందని చెప్పి జాబ్ కి బై చెప్పిన కుర్రాడు
Gen Z ( Image Source: Ai)
Viral News

Viral Video: చాలా బోర్ కొడుతోంది.. ఇక పని చేయలేనంటూ.. ఉద్యోగం వదిలేసిన Gen Z కుర్రాడు

Viral Video: బెంగళూరులోని ఓ యువకుడు, అన్షుల్ ఉతయ్య తన జాబ్ వదిలిలేయాలన్నా భావనతో తీసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో అతను తన అనుభవాలను పంచుకుంటూ.. మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని తెలిపాడు. ఆయన చెప్పిన విధంగా, “ ఈ పని అంటేనే భయం వేస్తోంది..  ఇంకా ఇక్కడే ఉంటే నాకు నేను దక్కను అని అనిపిస్తోంది” అని చెప్పాడు.

Also Read: TG Rising Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ స‌మ్మిట్‌ పూర్తి వివరాలు.. ప్రారంభం నుండి చివరి వరకు జరిగే షెడ్యూల్ ఇదే..!

ఉతయ్య తన వీడియోలో రెండు ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ ఇచ్చినా, అలా చదువుకు తిరిగి వెళ్లాలనుకోవడం లేదని వెల్లడించారు. ఫలితంగా, ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అతను చెప్పినట్లు, ఈ జాబ్ అతని మానసిక ఆరోగ్యం పై ప్రభావితమై, విలువైన సమయం వృధా అవుతుందని భావించాడు.

Also Read: Raj Samantha: పెళ్లి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన రాజ్ నిడిమోరు.. ‘షాదీ ముబారక్ హో’ అంటున్న నెటిజన్స్..

అతను ఉద్యోగం వదిలే ఆలోచనపై కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ వీడియోను పోస్టు చేసినప్పుడు, అన్షుల కి సుమారు 10,000 ఫాలోవర్లు ఉన్నారు. అయితే, 48 గంటలలో వీడియో ఫాలోవర్స్ సంఖ్యను రెట్టింపు చేస్తూ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, అలసట, కెరీర్ అసంతృప్తి, జెన్ Z ఉద్యోగుల ఎదుర్కొంటున్న కష్టాలపై చర్చలు మొదలు పెట్టారు.

Also Read: Gummadi Narsaiah biopic: తెలుగు సినిమా మీద ఉన్న చులకన భావానికి ఇదే నిదర్శనం.. ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

నెటిజన్స్ రియాక్షన్స్ ఇవే..

ఒకరు ఉతయ్య నిర్ణయానికి మద్దతుగా, “అవును, ఇది సరైన నిర్ణయం. తాను చేసింది కరెక్ట్ ” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరొక వినియోగదారు, అతని పరిస్థితిని తానే ఎదుర్కొన్న అనుభవంతో పోల్చుతూ, “మీ వీడియో చూసినప్పుడు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను.. మీరు చెప్పేది నాకు అర్ధమవుతుంది” అని వ్యక్తపరిచారు.

అలాగే, ఒక నెటిజన్, ఈ పరిస్థితికి వెనుక కారణాలను వివరిస్తూ, “ మీరు ఇంకా సరిగ్గా  ఫిట్ అవ్వలేదని అనిపిస్తుంది. మీరు మీ హృదయానికి అనుగుణంగా పని చేయాలి. మీరు పని చేస్తేనే కదా అన్ని తెలుస్తాయి, దీన్ని కొనసాగించండి” అని కామెంట్ లో రాసుకొచ్చాడు.

 

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు