Engagement Ring Missing: మందాన ఎంగేజ్‌మెంట్ రింగ్ మిస్సింగ్
Smrithi-Mandana (Image source X)
Viral News, లేటెస్ట్ న్యూస్

Engagement Ring Missing: పెళ్లి వాయిదా పడ్డాక స్మృతి మందాన ఫస్ట్ పోస్ట్.. ఎంగేజ్‌మెంట్ రింగ్ మిస్సింగ్

Engagement Ring Missing: భారత ప్రముఖ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందాన వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, ముహూర్తానికి కొన్ని గంటల ముందు అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడిన విషయం తెలిసిందే. యువ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమెకు కొంతకాలం క్రితమే ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే, ఊహించని పరిస్థితుల్లో పెళ్లి వాయిదా పడడంతో చర్చోపచర్చలు జరిగాయి. మందాన తండ్రికి గుండెపోటు రావడంతో హాస్పిటల్‌లో చేర్పించారని, తండ్రి తన పక్కన లేకుండా తాను పెళ్లి చేసుకోబోనంటూ ఆమె చెప్పినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అయితే, అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడడం, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మందాన – పలాష్ మధ్య ఏదో బెడిసికొట్టునట్టుగా ఉందంటూ వదంతులు చక్కర్లు కొట్టాయి. కాగా, వివాదం వాయిదా పడిన తర్వాత స్మృతి మందాన తొలిసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.

Read Also- TG Global Summit: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌లో కీలక మార్పులు

చేతి వేలికి కనిపించని ఎంగేజ్‌మెంట్ రింగ్

పెళ్లికి సంబంధించిన ఊహాగానాల నేపథ్యంలో, మందానా శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ వీడియో టూత్‌పేస్ట్ బ్రాండ్‌కు సంబంధించినది. అయితే, వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఒక విషయం క్రికెట్ అభిమానులను ఆసక్తిని రేకెత్తించింది. ఆమె చేతి వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకపోవడాన్ని (Engagement Ring Missing) నెటిజన్లు గుర్తించారు. రింగ్ కనిపించని మాట నిజమే కానీ, ఈ వీడియోను నిశ్చితార్థానికి ముందు షూట్ చేశారా?, లేక ఈ మధ్యే చిత్రీకరించారా? అనేది క్లారిటీ లేదు. ఎంగేజ్‌మెంట్‌కు ముందే ఈ వీడియోను చిత్రీకరించారని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. కాగా, స్మృతి తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పెళ్లికి సంబంధించిన పోస్టులన్నింటినీ తొలగించిన విషయం తెలిసిందే. దీంతో, వివాహంపై అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. మందాన తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడినట్టుగా ఇరు కుటుంబాల నుంచి ఏ ఒక్కరూ ప్రకటన చేయలేదు.

కాగా, పెళ్లి జరగాల్సిన రోజు ఉదయం గుండెపోటు రావడంతో మందాన తండ్రిని ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. ఆ మరుసటి రోజే పలాష్ కూడా హాస్పిటల్‌లో చేరడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. వాయిదా పడి ఇన్ని రోజులు కావొస్తున్నా కొత్త పెళ్లి తేదీపై ఇంతవరకు ఎలాంటి ప్రకటనా లేదు.

Read Also- Vladimir Putin: ఫుడ్ బాగుంది.. మై డియ‌ర్ ఫ్రెండ్‌.. మోదీపై పుతిన్ పొగ‌డ్త‌లు వింటే..

పలాష్ తల్లి ఏమన్నారంటే..

పలాష్ తల్లి అమితా మాత్రమే ఈ వివాహంపై నోరు విప్పారు. వివాహం త్వరలో జరుగుతుందని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశారు. పెళ్లి రోజున జరిగిన అనూహ్య పరిస్థితి కారణంగా స్మృతి, పలాష్ ఇద్దరూ బాధలో ఉన్నారని అమితా పేర్కొన్నారు. పెళ్లయ్యాక స్మృతికి ప్రత్యేక స్వాగతం పలకాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నానని, ఊహించని పరిస్థితుల కారణంగా పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చిందని అన్నారు. పెళ్లి త్వరలోనే జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వధువు స్మృతితో ఇంటికి రావాలని పలాష్ కలలు కన్నాడని ఆమె చెప్పారు. పలాష్ కూడా ఓ కార్యక్రమంలో పరోక్షంగా పెళ్లిపై స్పందించాడు. ఇరు కుటుంబాలకు ఇది చాలా, చాలా కష్టమైన సమయమని తాను భావిస్తున్నానని, సానుకూలతను నమ్మాలని తాము భావిస్తున్నామని అన్నాడు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?