TG Global Summit: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను మూడు భాషాల్లో తయారు చేయనున్నారు. తెలుగు(Telugu), ఇంగ్లీష్(English), ఊర్దూ(Urdhu) భాషల్లో డాక్యుమెంట్ లను రూపొందిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు వెయ్యి మంది ప్రతినిధులకు ఈ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని సూచించే ఈ డాక్యుమెంట్ రూపకల్పన వేగంవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎస్ కె. రామకృష్ణరావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం, వివిధ శాఖల నుంచి ఇన్ పుట్స్ ఆధారంగా డాక్యమెంట్ ను తయారు చేసే ప్రక్రియ వేగవంతం చేశారు. డాక్యుమెంట్ డిజైన్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీలు త్వరలో ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులోకి రానున్నాయి.వివిధ రంగాల, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీని కవర్ పేజీలో భవిష్యత్ లో భారత్ ఫ్యూచర్ సిటీలో రూపుదిద్దుకోనున్న సూచనాత్మక నగరం ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు.
Also Read: Live-in Relationship: పెళ్లి వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
నంబర్ వన్ దిశగా ప్లాన్..
తెలంగాణను 2047 నాటికి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాన ఉద్దేశం. యువత, రైతులు, మహిళల సాధికారత ద్వారా 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. హైదరాబాద్(Hyderabad)ను ప్రపంచస్థాయి ప్రతిభా కేంద్రంగా మార్చేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘ఈజ్ ఆఫ్ అట్రాక్టింగ్ టాలెంట్’పై కూడా దృష్టిసారించింది. మేధస్సును ఆకర్షించే తొలి భారత రాష్ట్రంగా నిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. 2047 నాటికి ప్రతి తెలంగాణ రైతు ఉత్పత్తిదారునిగా, ప్రాసెసర్ గా, బ్రాండ్ యజమానిగా, ఎగుమతిదారుగా ఎదగాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఆధునిక టెక్నాలజీతో పాటు సుస్థిర సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహించనుంది. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, నైపుణ్యాలు, అవకాశాలు కల్పించి తద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. బాలికలకు నాణ్యమైన పాఠశాల విద్య, డిజిటల్ లెర్నింగ్(Digitel Learning), స్టెమ్ పరిజ్ఞానం ద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
Also Read: Rising Global Summit: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ వేదిక తొలి ఫొటో రిలీజ్.. మామూలుగా లేదుగా!

