Flipkart Buy Buy 2025 Sale: సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ లో ఎప్పుడూ ఏదొక ఆఫర్లు ఉంటాయి. అయితే 2025 ఏడాది చివరి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ తన చివరి సేల్ అయిన Buy Buy 2025 Saleను లైవ్ చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్ సహా అనేక విభాగాల్లో ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ S25 ( Samsung Galaxy S25 ) సిరీస్— గెలాక్సీ S25 (Galaxy S25) , గెలాక్సీ S25 ఎడ్జ్ ( Galaxy S25 Edge), గెలాక్సీ S25 అల్ట్రా ( Galaxy S25 Ultra) ఫోన్లపై ఇప్పటివరకు పెట్టని డిస్కౌంట్లు వర్తిస్తున్నాయి.
Galaxy S25 Edge ఫోన్ పై భారీ తగ్గింపు
సామ్‌సంగ్ సిరీస్‌లోనే స్లిమ్మెస్ట్ మోడల్‌గా గుర్తింపు పొందిన Galaxy S25 Edge మొదట రూ.1,09,900 లాంచ్ అయింది. ప్రస్తుతం Buy Buy 2025 సేల్‌లో ఈ ఫోన్‌పై నేరుగా 18% ఫ్లాట్ తగ్గింపు ఇస్తుండగా, ధర రూ.89,999కి పడిపోయింది. అదనంగా SBI బ్యాంక్ కార్డు ఉపయోగిస్తే రూ.4,000 ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ కేవలం రూ.84,999కే దొరుకుతోంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన అతి తక్కువ ధర అని చెప్పాలి.
Galaxy S25 పై అదిరిపోయే బ్యాంక్ ఆఫర్
ప్రధాన మోడల్ అయిన Galaxy S25 కూడా మంచి తగ్గింపు పొందింది. అసలు ధర రూ.80,999గా ఉండగా, HDFC బ్యాంక్ కార్డు తో రూ. 7,000 ఆఫర్ పొందవచ్చు. దీంతో 12GB + 256GB వేరియంట్ చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ.73,999.
Also Read: Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీలో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?
Galaxy S25 Ultra ఫోన్ పై అదిరిపోయే ఆఫర్
ప్రీమియమ్ మోడల్ Galaxy S25 Ultra కూడా సేల్‌లో డిస్కౌంట్‌తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కలిపి ఫోన్ ధర రూ.1,05,999గా ఉంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన అత్యుత్తమ డీల్స్‌లో ఒకటిగా చెబుతున్నారు.

