Mahabubabad District: ఆ గ్రామానికి 25 ఏళ్ల తర్వాత రిజర్వేషన్
Mahabubabad District ( imageCREDIt: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: ఆ గ్రామానికి 25 ఏళ్ల తర్వాత జనరల్ మహిళా రిజర్వేషన్.. అంగన్వాడి టీచర్ కు రాజీనామా.. సర్పంచ్ గా పోటీకి సిద్ధం

Mahabubabad District: ఆ గ్రామానికి 25 ఏళ్ల తర్వాత జనరల్ మహిళ రిజర్వేషన్ వచ్చింది. దీంతో అదే గ్రామంలో అంగన్వాడి టీచర్ గా పని చేస్తున్న ఓ మహిళ సర్పంచ్ గా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఆ అంగన్వాడి టీచర్ కు ఇంకా 15 ఏళ్ల సర్వీస్ ఉన్నా కూడా సర్పంచ్ పై మోజుతో పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం గ్రామానికి 25 ఏళ్ల తర్వాత జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన కౌలూరి శిరీష అంగన్వాడీ టీచర్ గా పని చేస్తుంది.

Also Read: Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం

గ్రామస్తుల సహకారంతో ఆ గ్రామంలో సర్పంచ్ పోటీకి ఒప్పుకుంది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. అంగన్వాడి టీచర్ అంటే పదో తరగతి, ఇంటర్ చదివింది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అయితే ఆమె చదివింది ఆశా మాషి చదువు కాదు. ఎంఏ బీఈడీ చదివానని సర్పంచిగా గెలిపిస్తే వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి గ్రామం రీతిలో ఆణిపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలు నమ్ముతారా అనేది ప్రశ్న

అయితే ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి ప్రజలు నమ్ముతారా అనేది ప్రశ్న. అధికార పార్టీ అయితే అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుందని నమ్మే వాళ్ళు కావచ్చు. మరి శిరీష గెలుస్తుందా..? ఓడిపోతుందా..? ఎన్నికల తర్వాత తెలిసిపోతుంది. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్ గా ఇక్కడే పనిచేశాను కాబట్టి గ్రామంలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో..! నాకు తెలుసు కాబట్టి వాటన్నింటిని నన్ను గెలిపిస్తే తీరుస్తానని హామీ ఇస్తుంది.

Also Read: Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Just In

01

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​