CPR to Snake: గుజరాత్ (Gujarat)లోని వల్సాద్ జిల్లా (Valsad district)లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కు గురైన పాముకు వన్యప్రాణి సంరక్షకుడు సీపీఆర్ చేశాడు. నోట్లో నోరి పెట్టి ఊపిరి ఊదాడు. తద్వారా స్పహతప్పిన పాముకు ప్రాణం పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. పాముకు సీపీఆర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి సాహాసోపేతమైన నిర్ణయానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
వల్సాద్ జిల్లాలోని కాప్రాడా తాలుకా (Kaprada taluka)లో గల ఆమ్డా గ్రామం (Amdha village)లో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న కొందరు రైతులు.. విద్యుత్ స్తంభం పైకి ఎగబాకుతున్న పామును గమనించారు. వారు చూస్తుండగానే హైటెన్షన్ విద్యుత్ వైర్ల వద్దకు చేరుకొని ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురైంది. దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది. దీంతో రైతులు ఒక్కసారిగా పాము వద్దకు పరిగెత్తుకు వచ్చారు. కదలేని స్థితిలో పాము ఉండటాన్ని గమనించి.. వన్యప్రాణి సంరక్షకుడు ముకేష్ వాయద్ (Mukesh Vayad)కు సమాచారం ఇచ్చారు.
30 నిమిషాల పాటు..
ఆమ్డా గ్రామంలోనే నివసిస్తున్న ముకేష్.. హుటా హుటీనా ఘటనాస్థలికి చేరుకున్నాడు. చలనం లేకుండా ఉన్న పాము వద్దకు వెళ్లి కదిలించి చూశాడు. అయితే పాము ప్రాణాలతో ఉందని గమనించి.. వెంటనే దాని నోరు తెరిచి పీసీఆర్ చేయడం ప్రారంభించాడు. దాదాపు 30 నిమిషాల పాటు పాము నోట్లో నోరి పెట్టి ఊపిరి ఊదాడు. అలా చేస్తున్న క్రమంలోనే పాములో కదలికలు రావడాన్ని ముకేష్ గమనించాడు. దీంతో దానిని నెలమీద పెట్టాడు. కొద్దిసేపటికి పాము పూర్తిగా స్పృహలోకి వచ్చి సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులంతా ముకేష్ చేసిన పనిని అభినందించారు.
ముకేష్ రియాక్షన్ ఇదే..
పాముకు పీసీఆర్ చేయడంపై ముకేష్ మాట్లాడారు. తాను పదేళ్లుగా పాములను సంరక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వల్సాద్ లోని ధారంపూర్ లో ఉన్న స్నేక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో తాను శిక్షణ పొందినట్లు తెలిపారు. ‘ఘటనా స్థలికి చేరుకున్నప్పుడు అది రాట్ స్నేక్ (విషపూరిత పాము) అని తెలిసింది. శరీరాన్ని తాకినా స్పందన లేదు. దాని నోటిని తెరిచి సీపీఆర్ చేశాను. అలా చేసిన అరగంటకు పాము తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. పూర్తిగా స్పృహలోకి వచ్చిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది’ అని ముకేష్ వివరించారు.
Also Read: Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన
అలా చేయడం డేంజర్: నిపుణుడు
మరోవైపు ముకేశ్ చేసిన పనిని నిపుణులు తప్పుబడుతున్నారు. సూరత్ కు చెందిన వన్యప్రాణి శాస్త్రవేత్త కృణాల్ త్రివేద్.. ముకేష్ చేసిన పీసీఆర్ విధానాన్ని తప్పుబట్టారు. ‘ఇలాంటివి సరైన శిక్షణ పొందిన వారు మాత్రమే చేయాలి. అది కూడా వెటర్నరీ వైద్యుల సమక్షంలో చేయాలి. విద్యుత్ షాక్ లేదా ఎత్తు నుండి పడటం వల్ల పాము స్పృహ తప్పి ఉండొచ్చు. ముకేష్ ఉపయోగించిన పద్ధతిని ఎవరూ సిఫార్సు చేయరు. పాములకు కృత్రిమ శ్వాస ఇవ్వడానికి శిక్షణ పొందిన వెటర్నరీ వైద్యులు ప్రత్యేక పరిమాణం ఉన్న ఎండోట్రాకియల్ ట్యూబ్ (Endotracheal Tube)ను ఉపయోగిస్తారు, ఎందుకంటే వాటి శ్వాసనాళం చాలా సన్నగా ఉంటుంది’ అని తెలిపారు.
View this post on Instagram
