Investment Planning: సేవింగ్స్‌తో కోటి అసాధ్యం కాదు..
Money ( Image Source: Twitter)
బిజినెస్

Investment Planning: సేవింగ్స్‌తో కోటి అసాధ్యం కాదు.. నెలనెలా ఎంత పెట్టాలంటే?

Investment Planning: డబ్బు కూడబెట్టుకోవాలంటే మనం నెలనెలా పెట్టుబడి చేస్తూ ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తం పెట్టడం అందరికీ సాధ్యపడదు, అలాగే మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. అందుకే ఫైనాన్స్ నిపుణులు SIP ను సజెస్ట్ చేస్తుంటారు. SIPలో పెట్టుబడి పెడితే మార్కెట్ ఊగిసలాటలు జరిగిన మనం వివిధ రేట్లకు యూనిట్లు కొనుగోలు చేస్తాం. దీన్ని రుపీ కాస్ట్ అవరేజింగ్ అంటారు. దీని వల్ల ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా మంది చిన్న మొత్తాలతో ప్రారంభించి, కొన్నేళ్లలో ఎక్కువ డబ్బు వెనకేస్తున్నారు.

Also Read: Nalgonda District: పంచాయతీ ఎన్నికల బహిష్కరణ చేసిన గ్రామం.. డప్పు చాటింపుతో సంచలనంగా మారిన వైనం..!

ఇప్పుడు 10 ఏళ్లలో రూ.1 కోటి కావాలనుకుంటే, నెలకి ఎంత SIP పెట్టాలి అనేది మన పెట్టుబడికి వచ్చే రాబడిపై ఆధారపడి ఉంటుంది. రాబడి తక్కువైతే మనం నెలకి పెట్టాల్సిన మొత్తం ఎక్కువ అవుతుంది. రాబడి కొంచెం ఎక్కువైతే SIP మొత్తం తగ్గిపోతుంది. ఉదాహరణకు, సంవత్సరానికి 9% రాబడి మాత్రమే వస్తోంది.

Also Read: BCCI Team Selection: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ… గిల్‌ విషయంలో కండిషన్

నెలకి రూ.51,676 పెట్టాలి. ఇది నిజంగా పెద్ద మొత్తం. కానీ రాబడి 10%కి పెరిగితే మనం పెట్టాల్సిన SIP రూ.48,817కి తగ్గిపోతుంది. అలాగే 11% రాబడి వస్తే SIP మొత్తాన్ని రూ. 46,083కి తగ్గించొచ్చు. 12% రాబడి వచ్చే మంచి ఫండ్‌లో పెట్టుబడి పెడితే నెలకి రూ. 43,471 పెట్టినా సరిపోతుంది. ఇంకా 13% లాంటి అధిక రాబడి ఇచ్చే ఫండ్ దొరికితే SIP మొత్తం ఇంకా తగ్గి రూ. 42,320కే రూ. 1 కోటి లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం మొత్తం 10 ఏళ్లలో పెట్టాల్సిన మొత్తం కూడా రాబడి రేటుతో పాటు తగ్గిపోతుంది—9% రాబడికి రూ.62 లక్షలు పెట్టాలి, 13% రాబడికి కేవలం రూ. 50 లక్షలే సరిపోతుంది.

Also Read: Alibaba Quark AI Glasses: కళ్ల ముందే అన్నీ.. AI కళ్లజోడును రిలీజ్ చేసిన అలీబాబా, దీని ఫీచర్స్‌ తెలిస్తే ఫిదా అయపోతారు

Just In

01

Viral Video: రసగుల్లా రచ్చ.. పీటలపై ఆగిన పెళ్లి, గాల్లోకి ఎగిరిన కుర్చీలు, బల్లలు!

Hyderabad House History: ఢిల్లీలో ‘హైదరాబాద్ హౌస్’ ఎందుకుంది?, ఎవరు నిర్మించారు?, పుతిన్ పర్యటన వేళ ఆశ్చర్యపరిచే హిస్టరీ ఇదే!

Sritej Health: ఇప్పటికీ పట్టించుకోవడం లేదు.. అల్లు అర్జున్ తీరుపై శ్రీతేజ్ తండ్రి షాకింగ్ కామెంట్స్

Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!