Mulugu District: మేడారం జాతర పై ఎస్‌పి కీలక సమావేశం!
Mulugu District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mulugu District: మేడారం జాతర పై ఎస్‌పి సుధీర్ రామనాథ్ కేకన్ కీలక సమావేశం!

Mulugu District: జనవరి నెలలో నిర్వహించనున్న మేడారం మహా జాతర విజయవంతం కోసం అవసరమైన సమన్వయ చర్యలపై జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్(SP Kekan Sudhir Ramanath) బుధవారం పూజార్లతో మరియు అభ్యుదయ సంఘం యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “ఇది మన జాతర… అందరం ఒక జట్టులా కలిసి పనిచేస్తేనే జాతర విజయవంతమవుతుందని అన్నారు. గత పుణ్యం వల్లే ఈ జాతర లో తల్లులకు సేవ చేసే అదృష్టం మనందరికీ లభించిందని అన్నారు.

సమన్వయం – భద్రతపై కీలక సూచనలు

పూజారులు, యువత కోసం ప్రత్యేక పాసులు జారీ చేసి పూజారులు, యువత, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం లేకుండా కృషి చేస్తానని సూచించారు. ఈ సంవత్సరం మేడారం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతుండటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 10,000 మందికి పైగా పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్‌తో సమీక్షించి, పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తయ్యేలా విజ్ఞప్తి చేస్తానని ఎస్పీ అన్నారు.

Also Read: iPhone 16 Price: ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీ డిస్కౌంట్లతో iPhone 16.. కొనాలనుకుంటే కొనేయండి!

ట్రాఫిక్ నియంత్రణ – పార్కింగ్ ఏర్పాట్లు

గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు పార్కింగ్ సమస్యలు లేకుండా మెరుగైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తరకు వచ్చే ప్రతి భక్తుడు సులభంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పూజారులు, యువత, మేడారం ప్రజలు, పోలీసులు అందరూ ఒక కుటుంబంలా కలిసి పనిచేసి, ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఒక కుటుంబం లా పని చేసి మహా జాతరను విజయవంతం చేయాలనీ ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క–సారలమ్మ పూజారులు, గోవిందరాజు, పగిడిద్ద రాజు పూజారులు ములుగు డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, అభ్యుదయ యూత్ యువత కన్నెపల్లి యువత పాల్గొన్నారు.

Also Read: Kothagudem Railway Station: రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం.. బాంబును కొరికిన కుక్క మృతి..!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క